సైకిల్ పై 58 కి.మీ కోహ్లీ కోసం పిల్లాడి సాహసం

మన దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు... వారిని చూసేందుకు అభిమానులు చేసే సాహసాలు అన్నీ ఇన్నీ కావు..

Post Published By: Vencateshg
Updated : 27 September 2024, 9:10 PM IST

మన దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు... వారిని చూసేందుకు అభిమానులు చేసే సాహసాలు అన్నీ ఇన్నీ కావు.. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాలా... చిన్న పిల్లల నుంచి సెలబ్రిటీల వరకూ కోహ్లీ అంటే ఫుల్ క్రేజ్ ఉంది. తాజాగా 15 ఏళ్ళ స్కూల్ పిల్లాడు కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు పెద్ద సాహాసమే చేశాడు. ఏకంగా 58 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ కాన్పూర్ వచ్చేశాడు. యూపీలోని ఉన్నావో సిటీ నుంచి కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియానికి సైకిల్ పై వచ్చాడు. అతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోహ్లీ అంటే అందరికీ ఎంత క్రేజో ఇది చూస్తే తెలుస్తుందంటూ విరాట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Published : 
  • 27 September 2024, 9:10 PM IST