ఢిల్లీ జట్టులో మరో ఆల్ రౌండర్… ఎవరీ మాధవ్ తివారీ ?

పంజాబ్ కింగ్స్‌పై బౌలర్ల నుంచి బ్యాటర్ల వరకూ అందరూ సమష్టిగా రాణిస్తేనే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది, ఐపీఎల్ 2026 ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్‌లానే మరో ఆటగాడు కూడా మెరిశాడు

Post Published By: dialnews
Updated : 13 May 2026, 11:50 AM IST

పంజాబ్ కింగ్స్‌పై బౌలర్ల నుంచి బ్యాటర్ల వరకూ అందరూ సమష్టిగా రాణిస్తేనే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది, ఐపీఎల్ 2026 ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్‌లానే మరో ఆటగాడు కూడా మెరిశాడు. అతను బౌలింగ్, బ్యాటింగ్‌ రెండింటిలోనూ రాణించి 100 శాతం ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పేస్ ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ తన బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆకట్టుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌ 2026లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

బౌలింగ్‌లో ప్రియాన్షు ఆర్య, కూపర్ కాన్‌లీ వంటి డేంజరస్ బ్యాటర్ల వికెట్లు తీసుకోవడమే కాకుండా.. మార్కస్ స్టాయినీస్ లాంగ్ హైట్ క్యాచ్‌ను కూడా పట్టుకున్నాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన మాధవ్ తివారీ 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.ఇక బ్యాటింగ్‌లో కూడా మాధవ్ తివారి తాను ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీగా మార్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బెన్ ద్వార్షుయీస్ బౌలింగ్‌లో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని బౌండరీగా మలిచాడు. మార్కస్ స్టాయినీస్ బౌలింగ్‌లో సిక్సర్ బాది ఢిల్లీ క్యాపిటల్స్‌లో టెన్షన్ తగ్గించాడు.

19వ ఓవర్‌లో యశ్ ఠాకూర్ వేసిన యార్కర్‌ను బౌండరీగా మలిచాడు. కేవలం 8 బంతులు ఎదుర్కొన్న మాధవ్ తివారీ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో 18, బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసుకున్న మాధవ్ తివారీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మధ్యప్రదేశ్‌కు చెందిన మాధవ్ తివారీ డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకున్నాడు. 2025లో మాధవ్ తివారీని సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆ సీజన్‌లో ముంబైపై జరిగిన ఒక్క మ్యాచ్‌లోనే అవకాశం ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేయించని ఢిల్లీ, బ్యాటింగ్ ఆడిస్తే నాలుగు బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. మళ్లీ ఈ సంవత్సరం అవకాశం ఇవ్వగా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ రాణించి సత్తా చాటాడు.

Published : 
  • 13 May 2026, 11:50 AM IST