పాకిస్తాన్ కు మరో షాక్ 6 పాయింట్లు కోత

అసలే సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో ఘోరపరాభవం చవిచూసిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది.

Post Published By: Vencateshg
Updated : 26 August 2024, 7:12 PM IST

అసలే సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో ఘోరపరాభవం చవిచూసిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో ఐసీసీ గట్టి షాకే ఇచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాక్ జట్టు ఆరు పాయింట్లు కోత విధించింది. అలాగే పాక్‌ జట్టు మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించింది. అటు బంగ్లాదేశ్ కూడా మూల్యం చెల్లించుకుంది. బంగ్లాకు 3 పాయింట్లు, 115 శాతం మ్యాచ్ ఫీజు కోత పెట్టింది. ఈ మ్యాచ్ లో భారీస్కోర్ చేసినా పాక్ చిత్తుగా ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటర్ల వైఫల్యంతో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఐసీసీ నిర్ణయాల తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ ఏడు, పాక్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి

Published : 
  • 26 August 2024, 7:12 PM IST