స్మృతి,పలాష్ కలిసిపోయారా…? వైరల్ అవుతున్న వీడియో…!

భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన - సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ లవ్ ఎపిసోడ్ కు ఎలా బ్రేక్ పడింది అందరూ చూశారు. ఇంకొద్ది గంటల్లో తాళి మూడు ముళ్లు వేస్తాడనగా పెళ్లి ఆగిపోయింది

Post Published By: dialnews
Updated : 10 April 2026, 8:05 PM IST

భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన - సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ లవ్ ఎపిసోడ్ కు ఎలా బ్రేక్ పడింది అందరూ చూశారు. ఇంకొద్ది గంటల్లో తాళి మూడు ముళ్లు వేస్తాడనగా పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత ఇద్దరికీ బ్రేకప్ అయింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా అన్న ప్రశ్న సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దానికి కారణం నెట్టింట వైరల్ అవుతోన్న ఓ ఫ్యామిలీ వీడియోనే. నిజానికి భారత మహిళల జట్టు వరల్డ్‌కప్ 2025 గెలిచిన కొద్ది రోజుల్లోనే స్మృతి మంధాన - పలాష్ ముచ్చల్ వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే చివరి నిమిషంలో పెళ్లి అనూహ్యంగా వాయిదా పడింది.

మొదట పెళ్లి వాయిదాకు స్మృతి మంధాన తండ్రి అనారోగ్యమే కారణమనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో పలాష్ ముచ్చల్‌పై అనేక రూమర్స్ వచ్చాయి. స్మృతి మంధానను మోసం చేశాడంటూ ఏవేవో నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ వాటన్నింటినీ పలాష్ కుటుంబం ఖండించింది.వివాహం వాయిదా పడిన తర్వాత తమ రిలేషన్ కూడా ముగిసిందంటూ స్మృతి మంధాన - పలాష్ ముచ్చల్ అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఒక స్టేట్‌మెంట్ కూడా పాస్ చేశారు. దీనిపై ఎవ్వరూ అనవసర రాద్దాంతం చేయొద్దంటూ అప్పట్లో వీళ్లిద్దరూ కోరారు.అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ముంబైలో ఉన్న ఓ రెస్టారెంట్ బయట మంధాన తండ్రి శ్రీనివాస్, పలాష్ సోదరి పలక్ ముచ్చల్-భర్త మిథూన్ కనిపించారు. పలక్ ముచ్చల్ శ్రీనివాస్ కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడంతో నెటిజన్లు తమకు నచ్చినట్లు ఊహించుకున్నారు.ఇరు కుటుంబాలు దగ్గరయ్యారని, త్వరలోనే స్మృతి - పలాష్ పెళ్లి జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈ వీడియో పాతదా లేక ఇప్పటిదేనా అన్న క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో గురించి ఇరు కుటుంబసభ్యులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దాంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన వచ్చే వరకూ నెటిజన్లు ఊహాగానాలు హద్దులు లేకుండా పోవడం ఖాయం.

Published : 
  • 10 April 2026, 8:05 PM IST