టీ20 ఫార్మాట్‌లో ది బెస్ట్ అనిపించుకున్న బౌలర్‌లలో ఒకడు అర్ష్‌దీప్ సింగ్. ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం అతనికి శుభారంభం లభించలేదు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా తన నాలుగు ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చుకున్నాడు. అతని బౌలింగ్ ఎకానమీ రేటు 10కి పైమాటే. పైగా ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు.ఏకంగా తొమ్మిది ఎక్స్ ట్రా పరుగులు ఇచ్చుకోవడం అర్ష్ దీప్ సింగ్ పై ట్రోలింగ్ కు దారి తీసింది. ఒకటిన్నటీ20 ఫార్మాట్‌లో ది బెస్ట్ అనిపించుకున్న బౌలర్‌లలో ఒకడు అర్ష్‌దీప్ సింగ్. ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం అతనికి శుభారంభం లభించలేదు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడుర ఓవర్ అధికంగా వేసినట్టయిందతనికి. ఇందులో ఎనిమిది వైడ్లు, ఒక నో బాల్ ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదీ పంజాబ్ జట్టులో అత్యంత ఖరీదైన బౌలర్‌కు. తొలి మ్యాచ్‌లోనే అవాంఛిత రికార్డును నమోదు చేసుకున్నాడు. ఏ బౌలర్ కూడా తన పేరు మీద కోరుకోని విధంగా, ఐపీఎల్ చరిత్రలోనే సుదీర్ఘ ఓవర్ వేసిన బౌలర్‌గా నిలిచా. ఇది ఒక చెత్త రికార్డుగా అతని ఖాతాలో చేరింది.అర్ష్‌దీప్ సింగ్ తన మొదటి మూడు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చుకున్నప్పటికీ పంజాబ్ కింగ్స్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అతనిపై నమ్మకం ఉంచి చివరి ఓవర్ బాధ్యత అప్పగించాడు.
అప్పటికే తీవ్ర ఒత్తిడిలో అర్ష్ దీప్ లైన్ అండ్ లెంగ్త్ కోల్పోయాడీ చివరి ఓవర్ లో. ఆ ఓవర్ లో నాలుగు వైడ్లు, ఒక నో బాల్ వేశాడు. ఈ ఎక్స్ ట్రాల కారణంగా ఆరు బంతుల్లో ముగియాల్సిన ఆ ఓవర్‌లో మొత్తం 11 బంతులు వేయాల్సి వచ్చింది. ఈ ఓవర్‌లో అర్ష్‌దీప్‌కు వికెట్ లభించినా, అది నో బాల్ కావడంతో నిరాశ ఎదురైంది. 20వ ఓవర్‌లోని నాలుగో బంతికి రాహుల్ తెవాటియా వికెట్ పడగొట్టాడు. విజయ్ కుమార్ వైశాఖ్ క్యాచ్ పట్టినా బౌన్సర్ కారణంగా అంపైర్ నో బాల్‌గా ప్రకటించారు. అప్పటికే రెండు బౌన్సర్లు సంధించాడు అర్ష్ దీప్. అది మూడోది కావడంతో నో బాల్ ఇవ్వాల్సొచ్చింది. దీంతో తెవాటియా బతికిపోయాడు.