ప్రస్తుతం వైజాగ్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనితోపాటు మరొక స్టేడియాన్ని విశాఖపట్టణంలో ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా గోవా వేదికగా బీసీసీఐ 92వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి.
