స్మృతి, జార్జియా కాదు ఆర్సీబీని గెలిపించింది ఎవరో తెలుసా ?

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన ఆర్‌సీబీ ఫైనల్లోనూ అదే జోరు కనబర్చి ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది.

Post Published By: dialnews
Updated : 6 February 2026, 7:16 PM IST

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన ఆర్‌సీబీ ఫైనల్లోనూ అదే జోరు కనబర్చి ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. గురువారం వడోదర వేదికగా ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో టైటిల్‌ను ముద్దాడింది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.ఈ విజయంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్‌ రికార్డును ఆర్‌సీబీ సమం చేసింది. 2024 సీజన్‌లో ఆర్‌సీబీ తొలి టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజా ఫైనల్లో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్‌సీబీ.. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్నిఅందుకున్న జట్టుగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్లో ఆర్‌సీబీ విజయానికి మంధాన, వాల్ కారణం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 203 పరుగులు చేసింది. అనంతరం ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసి గెలుపొందింది. జార్జియో వాల్, స్మృతి మంధాన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు.ఈ మ్యాచ్‌లో జార్జియో వాల్, స్మృతి మంధాన 165 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేసినా.. ఆర్‌సీబీ విజయలాంఛనాన్ని పూర్తి చేసింది మాత్రం రాధాయాదవ్ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆఖరి ఓవర్‌లో రాధా యాదవ్ ఆ రెండు బౌండరీలు కొట్టకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెబుతున్నారు. ఎందుకంటే విజయం ముంగిట సెట్ అయిన వాల్, మంధాన ఔటయ్యారని, బిగ్ హిట్టర్ రిచా ఘోష్ కూడా ఔటైందని, దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిందని గుర్తు చేస్తున్నారు. చివరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయని, క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్లు ఫైనల్ ఒత్తిడిలో ఈ పరుగులు చేయడం అంత సులువు కాదని, రాధా యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో రెండు బౌండరీలు బాది విజయాన్ని అందించిందని క్రికెట్ విశ్లేషకులు కొనియాడుతున్నారు.

Published : 
  • 6 February 2026, 7:16 PM IST