సన్ రైజర్స్ కు గుడ్ న్యూస్… ఎషాన్ మలింగాకు లైన్ క్లియర్…!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఎషాన్ మలింగా ఐపీఎల్ 19వ సీజన్ ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. ఐపీఎల్ 2026 సీజన్ ఆడేందుకు ఎషాన్ మలింగాకు శ్రీలంక క్రికెట్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది.

Post Published By: dialnews
Updated : 25 March 2026, 4:15 PM IST

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఎషాన్ మలింగా ఐపీఎల్ 19వ సీజన్ ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. ఐపీఎల్ 2026 సీజన్ ఆడేందుకు ఎషాన్ మలింగాకు శ్రీలంక క్రికెట్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో అతను త్వరలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరనున్నాడు.ఎషాన్ మలింగా రాకతో బౌలింగ్ విభాగం బలం పెరగనుంది. అయితే ఎషాన్ మలింగా రాకపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా ఎషాన్ మలింగా భుజానికి గాయమైంది.

ఈ గాయం కారణంగానే అతను ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి దూరమయ్యాడు. అప్పటి నుంచి అతను శ్రీలంక క్రికెట్ బోర్డు పర్యవేక్షణలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు.ఎషాన్ మలింగా తన గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. క్రిక్‌బజ్ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే తొలి మ్యాచ్‌లోనే ఎషాన్ మలింగా బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా, కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరణకు ఇంకా ఫిట్‌నెస్ టెస్ట్ కాలేదని క్రిక్‌బజ్ పేర్కొంది. అటు ఆర్‌సీబీ పేసర్ నువాన్ తుషారాపై ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాలేదని తెలిపింది.

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ముమ్మరంగా సాధన చేస్తోంది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుతూ తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటుంది. అలాగే ఫ్యాన్స్ మీట్ కార్యక్రమాలతో హైప్ క్రియేట్ చేస్తోంది. బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. అయితే ఎషాన్ మలింగా రాకతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ కష్టాలు కొంత తీరనున్నాయి. ఎషాన్ మలింగా రాకపై ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షేర్ ఆయేగా అంటూ కామెంట్ చేస్తున్నారు. గతేడాది 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మలింగా.. ఈసారి కూడా అదే జోరు కొనసాగిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Published : 
  • 25 March 2026, 4:15 PM IST