దాదాపు నాలుగేళ్ల తర్వాత విండీస్ – భారత్ జట్ల మధ్య టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. చివరిసారిగా 2019లో విండీస్ పర్యటనకు టీమ్‌ఇండియా వెళ్లింది. గతేడాది భారత్‌కు విండీస్ వచ్చినా టెస్టు సిరీస్ ఆడలేదు. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్‌ఇండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, గత 21 ఏళ్ల కాలంలో ఇరు దేశాల మధ్య ఎనిమిది సిరీస్‌లు జరిగాయి. అన్నింటినీ టీమ్‌ఇండియానే గెలుచుకోవడం గమనార్హం. చివరిసారిగా భారత్‌పై వెస్టిండీస్ 2001/2002 సీజన్‌లో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా విండీస్ గెలవలేకపోయింది.

In India vs West Indies matches since many years under the leadership of Sunil Gavaskar and Rahul Dravid, India has been getting the upper hand