కేఎల్ రాహుల్ బ్యాడ్ లక్… ఏ టీంకు ఆడినా ఇంటికే…!

ఐపీఎల్ లో చాలా మంది యువ ఆటగాళ్లు వచ్చిన కొద్దికాలంలోనే అదరగొట్టి తమ తమ జట్ల విజయాల్లో కీలకంగా మారిపోయారు. కానీ భారత క్రికెట్ లో అద్భుతమైన ఆటగాడిగా పేరున్న కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో మాత్రం నష్ట జాతకుడిగా మిగిలిపోయాడు.

Post Published By: dialnews
Updated : 27 May 2026, 11:55 AM IST

ఐపీఎల్ లో చాలా మంది యువ ఆటగాళ్లు వచ్చిన కొద్దికాలంలోనే అదరగొట్టి తమ తమ జట్ల విజయాల్లో కీలకంగా మారిపోయారు. కానీ భారత క్రికెట్ లో అద్భుతమైన ఆటగాడిగా పేరున్న కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో మాత్రం నష్ట జాతకుడిగా మిగిలిపోయాడు. పాపం.. KL రాహుల్ ఎంత కష్టపడినా.. ఎంత అద్భుతంగా రాణించినా.. అతను ఏ టీం తరపున ఆడితే ఆ టీం ఐపీఎల్ కప్ సొంతం చేసుకోకుండానే ఇంటి బాట పడుతున్నాయి. కేఎల్ రాహుల్ 2013 నుంచి ఐపీఎల్ టోర్నీ ఆడుతున్నాడు. 13 సంవత్సరాలుగా కేఎల్ రాహుల్ ఏ టీంలో ఆడినా.. ఆ టీం ఐపీఎల్ కప్ గెలవకుండానే నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించడం రాహుల్ దురదృష్టానికి అద్దం పడుతోంది.

ఈ 2026 ఐపీఎల్ సీజన్ అయినా.. కలిసొస్తుందనుకుంటే రాహుల్కు నిరాశనే మిగిల్చింది. ఈ టోర్నీలో ఢిల్లీ ఆడిన 14 మ్యాచుల్లో ఏడు గెలిచి, ఏడు ఓడిపోయింది. రన్ రేట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, కీలక మ్యాచుల్లో చేతులెత్తేయడంతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించకుండానే ఢిల్లీ నిష్క్రమించక తప్పలేదు.కేఎల్ రాహుల్ 2013, 2016లో RCB తరపున, 2014, 2015లో SRH తరపున, 2018 నుంచి 2021 వరకూ పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా, 2022 నుంచి 2024 వరకూ లక్నో కెప్టెన్గా, 2025, 2026లో ఢిల్లీ జట్టులో ప్లేయర్గా ఆడాడు.

సన్ రైజర్స్ 2016లో ఐపీఎల్ కప్ గెలిచింది. కానీ.. కేఎల్ రాహుల్ ఆ సీజన్లో ఆర్సీబీలో ఉన్నాడు. 2025లో ఆర్సీబీ కప్ గెలిచింది. కానీ.. ఈ సీజన్లో కేఎల్ రాహుల్ ఢిల్లీ జట్టులో ఉన్నాడు. లక్నో, ఢిల్లీ జట్లకు ఇప్పటికీ ఐపీఎల్ కప్ కలగానే మిగిలిపోయింది. ఇలా KL రాహుల్ టైమేంటో పాపం.. ఐపీఎల్ టోర్నీలో దురదృష్టానికి దగ్గరగా, అదృష్టానికి దూరంగా ఉంది. కానీ ప్రతీ సీజన్ లోనూ అతను నిలకడగా రాణిస్తున్నాడు. గత పది సీజన్లలో ఎనిమిది సార్లు 500 పైగా పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్ లోనూ 14 మ్యాచ్ లలో 45కు పైగా సగటుతో 593 పరుగులు చేసాడు. దీనిలో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Published : 
  • 27 May 2026, 11:55 AM IST