MS Dhoni: తన జెర్సీ వెనుక 7వ నంబర్..అసలు సీక్రెట్ చెప్పిన ధోనీ

అందరూ ఏడవ నంబర్ అంటే భయపడతారు. కానీ, ధోనీ మాత్రం ఈ నంబర్ జెర్సీతోనే మ్యాజిక్ చేశాడు. ఏకంగా రెండు వరల్డ్ కప్‌లు గెలిచాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని అక్కడి యాంకర్ అతని జెర్సీ నంబర్ 7పై ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగాడు.

Post Published By: narender Thiru
Updated : 12 February 2024, 3:43 PM IST

MS Dhoni: ప్రతీ క్రికెటర్ తాను ధరించే జెర్సీ వెనుక ఫేవరెట్ నంబర్ వేసుకుంటారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఏడవ నంబర్ జెర్సీ ధరిస్తాడు. అందరూ ఏడవ నంబర్ అంటే భయపడతారు. కానీ, ధోనీ మాత్రం ఈ నంబర్ జెర్సీతోనే మ్యాజిక్ చేశాడు. ఏకంగా రెండు వరల్డ్ కప్‌లు గెలిచాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని అక్కడి యాంకర్ అతని జెర్సీ నంబర్ 7పై ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగాడు.

Virat Kohli: కోహ్లీ రీ ఎంట్రీ ఎప్పుడంటే..

మీ పేరెంట్స్ ప్రతి రోజూ ఆ సమయానికి ఇంటికి రావాల్సిందే అని చెప్పారా అని సదరు యాంకర్ కాస్త సరదాగా ప్రశ్నించాడు. అది తన పేరెంట్స్ తనని ఈ భూమి మీదికి తీసుకురావడానికి ఎంచుకున్న సమయం లేదా తేదీ కావచ్చన్నాడు. తాను జులై 7న జన్మించాననీ, జులై ఏడో నెల, అందుకే నీకు ఏ నంబర్ కావాలని అడిగినప్పుడు చెప్పడానికి నాకు చాలా ఈజీ అవుతుందన్నాడు. ప్రతి ప్రశ్నకు తనదైన రీతిలో కాస్త చమత్కారాన్ని జోడించి చెప్పే అలవాటున్న ధోనీ.. ఇప్పుడూ అలాగే స్పందించేసరికి అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వారు.

ఇదిలా ఉంటే జెర్సీ నంబర్ 7తో ధోనీ ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇండియన్ క్రికెట్ టీమ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అతని గౌరవార్థం బీసీసీఐ ధోనీ రిటైరైన తర్వత అతని ఏడో నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించింది.

Published : 
  • 12 February 2024, 3:43 PM IST