కన్నీళ్లకు బదులు తీర్చుకునే అవకాశం భారత జట్టుకు వచ్చింది. ప్రపంచ కప్-2023లో భాగంగా సెమీస్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు మళ్లీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి 2019 ప్రపంచకప్ పరాభవానికి లెక్క సరిచేయాలని కోట్లాది మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు.
