ఐపీఎల్ మెగావేలంలో తొలిరోజే రికార్డుల సునామీ కనిపించింది. ఊహించినట్టుగానే వేలంలోకి వచ్చిన పలువురు స్టార్ ప్లేయర్స్ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అనుకున్నట్టుగానే ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు.
