అరంగేట్రంలోనే అదుర్స్

టీమిండియా యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ వన్డేల్లోకి గ్రాండ్ గా అడుగుపెట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేతో అతడు 50 ఓవర్ల ఫార్మాట్​లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే 3 వికెట్లతో తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అతని డెబ్యూ క్యాప్ ఇచ్చి జట్టులోకి వెల్ కమ్ చెప్పాడు. అన్ని విభాగాల్లో సత్తా చాటాలని ఆకాంక్షిస్తూ విషెస్ చెప్పాడు. కాగా ఈ మ్యాచ్ లో బంతితో […]

Post Published By: Vencateshg
Updated : 7 August 2024, 6:59 PM IST

టీమిండియా యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ వన్డేల్లోకి గ్రాండ్ గా అడుగుపెట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేతో అతడు 50 ఓవర్ల ఫార్మాట్​లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే 3 వికెట్లతో తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అతని డెబ్యూ క్యాప్ ఇచ్చి జట్టులోకి వెల్ కమ్ చెప్పాడు. అన్ని విభాగాల్లో సత్తా చాటాలని ఆకాంక్షిస్తూ విషెస్ చెప్పాడు. కాగా ఈ మ్యాచ్ లో బంతితో మెరిసాడు రియాన్ పరాగ్. ముగ్గురు కీలక బ్యాటర్లను ఔట్ చేశాడు. ఓపెనర్ ఫెర్నాండో, కెప్టెన్ అసలంకతో పాటు వెల్లలాగేను కూడా పెవిలియన్ కు పంపాడు.

Published : 
  • 7 August 2024, 6:59 PM IST