Shivam Dube: వరల్డ్ కప్ టీంలో పవర్ హిట్టర్.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే..!
ప్రస్తుతం విదేశీ బౌలర్లకు శివమ్ దూబె పేరు వింటేనే వారికి గొంతు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిల్చున్న చోటు నుంచి ఎంతటి తోపు బౌలర్ ని అయినా అలవోకగా సిక్సర్ కొట్టేస్తున్నాడు. క్రీజులోకి వచ్చింది మొదలు.. ఉన్నంతసేపు బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు.