సూర్యా భాయ్ జోక్ చేశాడనుకున్నా, ఇదంతా కలలా ఉందన్న సిరాజ్…!

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ జీవితంలో గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలు సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తున్నాయి. గతేడాది కాలంగా టీ20 ఫార్మాట్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ ఏడాది జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో తాను భాగం అవుతానని మహ్మద్ సిరాజ్ కనీసం

Post Published By: dialnews
Updated : 9 February 2026, 10:16 AM IST

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ జీవితంలో గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలు సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తున్నాయి. గతేడాది కాలంగా టీ20 ఫార్మాట్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ ఏడాది జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో తాను భాగం అవుతానని మహ్మద్ సిరాజ్ కనీసం ఊహించలేదు. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్‌లో అనూహ్యంగా చోటు దక్కించుకున్న అద్భుతంగా రాణించిన సిరాజ్.. తన సెలెక్షన్ వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టాడు. అసలు తాను వరల్డ్ కప్ ఆడతానని అస్సలు ఊహించలేదని.. అంతా దేవుడి దయ అని మహ్మద్ సిరాజ్ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. అది తనకు రాసిపెట్టుందని మియా భాయ్ చెప్పుకొచ్చాడు.

మహమ్మద్ సిరాజ్ గత ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్‌లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, ఈసారి ప్రపంచకప్‌లో ఉంటానని ఆశలు వదులుకున్నారు. ఫిబ్రవరి 15న రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూడాలని, ఆపై రంజాన్ నెలలో కుటుంబంతో గడపాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ హర్షిత్ రాణా గాయపడటం సిరాజ్ కెరీర్‌ను మలుపు తిప్పింది.అమెరికాపై అద్భుత స్పెల్ తర్వాత మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ తన ఎంపిక గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను ఇంట్లో కుటుంబంతో గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి కాల్ వచ్చిందన్నాడు. రెడీ అయిపో, బ్యాగ్ ప్యాక్ చేసుకుని వెంటనే వచ్చేయ్' అని చెప్పారు. అది విని షాక్ అయ్యాననీ,. సూర్య భాయ్ జోకులు వేయకండి అన్నట్టు గుర్తు చేసుకున్నాడు. కానీ ఆయన ఇది నిజం అని చెప్పడంతో ఆశ్చర్యానికి హద్దుల్లేవంటూ సిరాజ్ ఆనందంతో వెల్లడించాడు.

కేవలం స్క్వాడ్‌లోకి రావడమే కాకుండా.. జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా సిరాజ్‌కు నేరుగా ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న సిరాజ్.. అమెరికాపై 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. దేవుడు తన తలరాతను మార్చాడనీ,. విమానంలో టీ20 ప్రపంచకప్ జట్టుతో ప్రయాణించడం ఒక కలలా అనిపించిందన్నాడు. రంజీ ట్రోఫీలో ఏ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశానో, ఇక్కడ కూడా అదే ప్లాన్ అమలు చేశానని మహ్మద్ సిరాజ్ తెలిపారు.

Published : 
  • 9 February 2026, 10:16 AM IST