సునీల్ నరైన్ @ 200 విండీస్ స్పిన్నర్ సరికొత్త చరిత్ర…!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. 2012లో తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ కరేబియన్ స్పిన్నర్.. తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సలీల్ అరోరాను క్లీన్ బౌల్డ్

Post Published By: dialnews
Updated : 4 May 2026, 1:00 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. 2012లో తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ కరేబియన్ స్పిన్నర్.. తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సలీల్ అరోరాను క్లీన్ బౌల్డ్ చేసి.. 200వ ఐపీఎల్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే పలు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు.2012లో కేకేఆర్ తరఫున తొలిసారి ఐపీఎల్ డెబ్యూ చేశాడు నరైన్. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సీజన్ కూడా మిస్ కాలేదు. ప్రతీ సీజన్‌లో బరిలోకి దిగాడు. ఒకే ఫ్రాంఛైజీ తరఫున ఆడుతూ వచ్చాడు. తాజాగా ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన.. తొలి విదేశీ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఒకే ఫ్రాంఛైజీ తరఫున ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గానూ సునీల్ నరైన్.. నిలిచాడు.

కేకేఆర్ 2012, 2014, 2024లో ఆ జట్టు విజేతగా నిలిచింది. ఈ మూడు సార్లు కూడా.. సునీన్ నరైన్.. కేకేఆర్ జట్టులో ఉన్నాడు. తన మిస్టరీ స్పిన్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ.. కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.అంతేకాకుండా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో ప్లేసులో నిలిచాడు. నరైన్ బౌలింగ్ లో కేవలం వికెట్లు తీయడమే కాదు, పరుగులను నియంత్రించడంలో కూడా అతను దిట్ట. ఐపీఎల్ చరిత్రలో 100 కంటే ఎక్కువ వికెట్లు తీసి, 7 లోపు ఎకానమీ రేట్ కలిగిన ఏకైక బౌలర్ సునీల్ నరైన్ మాత్రమే. బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే అతని బౌలింగ్ శైలి ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉంది.

ఐపీఎల్ లో అత్యధిక సార్లు నాలుగు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కూడా నరైన్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటివరకు 8 సార్లు ఈ ఘనత సాధించగా, చాహల్ 9 సార్లు ఈ ఫీట్ చేశాడు. నరైన్ గణాంకాల్లో ఒక ఐదు వికెట్ల ఘనత , ఒక హ్యాట్రిక్ కూడా ఉంది.ఓవరాల్ టీ20 క్రికెట్ లో కూడా నరైన్ రికార్డులు కళ్లు చెదిరేలా ఉన్నాయి. మొత్తం 591 మ్యాచుల్లో అతను 621 వికెట్లు తీశాడు. 6.17 ఎకానమీ రేట్ తో పరుగులు ఇస్తూ బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు. అతని కెరీర్ లో 12 సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శనలు, ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన ఉన్నాయి.

Published : 
  • 4 May 2026, 1:00 PM IST