డిసెంబర్ 10వ తేదీ నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ జరుగనుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి టీమిండియాతో జరిగే మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. ఎడమ కాలు చీలమండలో గాయం కారణంగా జట్టు నుంచి లుంగి ఎంగిడి తప్పుకున్నాడు. దీంతో భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు రెండేళ్ల తర్వాత బ్యూరాన్ హెండ్రిక్స్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

Team India's T20 series against South Africa will be held from December 10. Is it a war without two?