ఇదే గోల్డెన్ ఛాన్స్.. సర్ఫరాజ్ నిలబెట్టుకుంటాడా.. ?

దాదాపు రెండేళ్ల తర్వాత యువ క్రికెట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ మ‌ళ్లీ భారత జ‌ట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంక‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌కు అత‌న్ని ఎంపిక చేశారు. సాయి సుద‌ర్శ‌న్ గాయ‌ప‌డ‌డంతో.. అత‌ని స్థానంలో స‌ర్ఫ‌రాజ్‌కు చోటు క‌ల్పించారు.

Post Published By: dialnews
Updated : 12 August 2026, 6:50 PM IST

దాదాపు రెండేళ్ల తర్వాత యువ క్రికెట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ మ‌ళ్లీ భారత జ‌ట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంక‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌కు అత‌న్ని ఎంపిక చేశారు. సాయి సుద‌ర్శ‌న్ గాయ‌ప‌డ‌డంతో.. అత‌ని స్థానంలో స‌ర్ఫ‌రాజ్‌కు చోటు క‌ల్పించారు. అయితే గ‌తంలో భారీ బ‌రువు వ‌ల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌.. ఇప్పుడు సూప‌ర్ స్లిమ్ అయ్యాడు. గ‌డిచిన 18 నెల‌ల్లోనే అత‌ను సుమారు 17 కేజీల బ‌రువు త‌గ్గాడు. దీంతో చాలా అట్రాక్టివ్‌గా, హుషారుగా స‌ర్ఫ‌రాజ్ క‌నిపిస్తున్నాడు. ఇటీవ‌ల ముంబై టీ20 లీగ్‌లో అత‌ను త‌న మెరుపు ఇన్నింగ్స్‌ల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆకాశ్ టైగ‌ర్స్ వెస్ట్ర‌న్ ముంబై త‌ర‌పున అత‌ను ఆ టోర్నీలో ఆడాడు.

అయితే ఆ టోర్నీ ముగిసిన త‌ర్వాత వ‌ర్షాకాలం కావ‌డంతో.. అత‌ను త‌న ప్రాక్టీస్‌ను క‌శ్మీర్‌కు మార్చేశాడు. అక్క‌డ నెట్ బౌల‌ర్ల‌తో ప్రాక్టీస్ చేశాడు. ఈ స‌మ‌యంలోనే అత‌ను ఫిట్‌నెస్‌పై మ‌రింత ఫోక‌స్ పెట్టాడు. నేను ఫిట్ లేక‌పోవ‌చ్చు, కానీ అన్ని ర‌కాలుగా పోరాడుతాను అని కొన్ని రోజుల క్రిత‌మే స‌ర్ఫ‌రాజ్ త‌న సోష‌ల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు.టాలెండ్ ఉన్నా సర్ఫరాజ్ కు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఓవర్ వెయిట్ తో కూడా వచ్చాయి.అయితే స‌ర్ఫ‌రాజ్ ఇప్పుడు త‌న లుక్‌ను మార్చేశాడు. షార్ప్‌గా మారిపోయాడు.

ముంబై టీ20 క్రికెట్ లీగ్‌తో అత‌ను మ‌రింత రాటుదేలాడు. 2024లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో నాలుగు సార్లు స‌ర్ఫ‌రాజ్ విఫ‌లం అయ్యాడు. దీంతో అత‌న్ని టీమిండియా జ‌ట్టు నుంచి త‌ప్పించారు. వాస్త‌వానికి ఆ సిరీస్‌లో మేటి బ్యాట‌ర్లు అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. కానీ వేటు మాత్రం స‌ర్ఫ‌రాజ్‌పై ప‌డింది. తిరిగి జ‌ట్టులో స్థానం సంపాదించేంద‌కు స‌ర్ఫ‌రాజ్ తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు. వాస్త‌వానికి లంక టూర్ కోసం రుతురాజ్ గైక్వాడ్‌, షేక్ ర‌షీద్ పేర్లు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. కానీ గిల్‌, పంత్ త‌ర్వాత స్పిన్‌ను మెరుగ్గా ఆడే బ్యాట‌ర్ల జాబితాలో స‌ర్ఫ‌రాజ్ నిలుస్తాడ‌ని అంచ‌నా వేశారు. ద్రువ్ జురెల్ క‌న్నా మెరుగ్గా స‌ర్ఫ‌రాజ్ ఆడుతాడేమో అన్న అభిప్రాయాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.

Published : 
  • 12 August 2026, 6:50 PM IST