రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం బాదినా జట్టును గెలిపించలేకపోయాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో 183 పరుగులకే పరిమితమైంది.
