Tirumala: చిన్నారిని చంపిన చిరుత.. తిరుమల నడకదారిలో భక్తులకు భద్రత లేదా? టీటీడీ ముందు అతిపెద్ద సవాల్
ఈ మధ్య కాలంలో తిరుమలలో భక్తులను చిరుత పులులు భయపెడుతున్నాయి. ఓ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపడిన ఘటన మరవకముందే… నడకమార్గంలో వెళ్తున్న ఆరేళ్ల పాప చిరుత పంజాకు బలైపోయింది. స్వామి దర్శనానికి వెళ్తూ వణ్యప్రాణులకు భక్తులు బలైపోవడం తిరుమల చరిత్రలోనే తొలిసారి.