CM REVANTH REDDY: మహాలక్ష్మి పథకం ప్రారంభం.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ ‘అందరికీ వైద్యం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ’ పథకాన్ని సీఎం రేవంత్ శనివారం ప్రారంభించారు. అలాగే తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహాలక్ష్మి’ పథకాన్ని కూడా ప్రారంభించారు.