Madhya Pradesh

General elections  : ఫిబ్రవరిలోనే సార్వత్రిక ఎన్నికలు..? ముందస్తుపై బీజేపీ మొగ్గు..!

General elections : ఫిబ్రవరిలోనే సార్వత్రిక ఎన్నికలు..? ముందస్తుపై బీజేపీ మొగ్గు..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో గెలిచింది. కాంగ్రెస్ కి తెలంగాణ ఒక్కటే దక్కింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. రాబోయే జనరల్ ఎలక్షన్స్ కి సెమీ ఫైనల్ గా భావించారు. ఈ సెమీ ఫైనల్స్ లో బీజేపీ దూకుడు ప్రదర్శించడంతో.. అదే స్పీడ్ లో లోక్ సభ ఎన్నికలకు కూడా వెళితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోంది. ఒక నెల ముందే ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపట్టింది. పైగా మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో గెలవడంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. బీజేపీ అనుకుంటే.. ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.