ఈ ఏడాది సంక్రాంతికి పలు సినిమాలు విడుదలయ్యాయి. ‘గుంటూరు కారం’, (Guntur Kaaram) ‘హనుమాన్'(Hanuman), ‘సైంధవ్’, ‘నా సామి రంగ’ సినిమాలు పొంగల్ బరిలో దిగి ప్రేక్షకులను అలరించాయి.
మహేశ్ మాసివ్ యాక్టింగ్‌తో దుమ్ము రేపినప్పటికీ.. టాక్ పరంగా గుంటూరు కారం మిక్స్‌డ్ రిజల్ట్ అందుకుంది ఈ మూవీ. ఆ తర్వాత వెంకటేశ్ సైంధవ్.. తర్వాత రోజు నాగార్జున నా సామిరంగా విడుదలయినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.
సంక్రాంతి అంటే కామెడీ అయిపోయింది. 365 రోజుల్లో మరో డేట్ లేనట్టు.. అందరూ సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యారు. నాలుగైదు సినిమాలకు చోటుంటే.. ఎనిమిది మంది కర్చీఫ్ వేసేశారు. 2024 సంక్రాంతికి ఇంత డిమాండ్ వుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. గుంటూరు కారం.. హనుమాన్ వంటి సినిమాలు ముందే సంక్రాంతికి వస్తున్నట్టు ఎనౌన్స్ చేశాయి.