BRSతో BSP పొత్తు ఖరారు.. 3 ఎంపీ సీట్లు ఇవ్వాలని RS ప్రవీణ్ డిమాండ్..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాసేపటి క్రితమే బంజారాహిల్స్‌లోని నందినగర్ లోని కేసీఆర్ నివాసం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమాన్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.