Tillu chiru : టిల్లు స్క్వేర్’ సినిమా చూసి మెగాస్టార్ ఫిదా!
2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా.. బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది.