Telangana assembly elections are fast approaching KCR CM KCR second phase election schedule released 54 meetings in 16 days
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ( Telangana assembly elections ) రసవంతంగా మారుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ లో ఎన్నికల ప్రచారం కనిపిస్తుంది. రోజుకు మూడు సభలు చొప్పున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు గులాబీ దళపతి. ఇక ఇప్పటి వరకు 17 రోజులు 42 సభలు నిర్వహిస్తు ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు గులాబీ బాస్.
ఈ ప్రచారం జరుగుతునే కేసీఆర్ ( CM KCR ) రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 13 నుంచి 28 వరకు 16 రోజుల్లో మొత్తం 54 సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం మరింత ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు వ్యాహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం రెండో షెడ్యూల్ ఖరారు చేశారు. ఇప్పటికే రాజశ్యామల యాగాన్ని పూర్తి చేసి.. నిన్న తన సెంటిమెంట్ దైవం అయిన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోని నామినేషన్ పత్రాలకు వెంకన్న పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు సీఎం కేసీఆర్. ఇక ఈ నెల 25న హైదరాబాద్ లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభతో భారీ బహిరంగా సభ నిర్వహించి జంటనగరాల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. ఈ నెల 28న చివరి సభ కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో నిర్వహించి ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకనున్నారు.
నవంబర్ 10 వరకు నామినేషన్ల స్వీకరణ.. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 చివరి తేదీని కేంద్ర ఎన్నిక సంస్థ ప్రటించింది. నవంబర్ 30 ను తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న అధికారికంగా ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు.
SURESH