కొడుక్కి నోటీసులు రావడంతో సీన్‌లోకి కేసీఆర్‌ ఎంట్రీ..!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో KTRకు సిట్‌ నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్‌ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్ల పర్యటలో ఉన్నారు.

  • Written By:
  • Publish Date - January 22, 2026 / 08:30 PM IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో KTRకు సిట్‌ నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్‌ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్ల పర్యటలో ఉన్నారు. సిట్‌ నోటీసుల నేపథ్యంలో ఇవాళ ఆయన సిరిసిల్ల బీఆర్ఎస్‌ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లనున్నారు కేటీఆర్‌.

కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్‌ రావు కూడా ఎర్రవెల్లి ఫాం హౌజ్‌కు రానున్నారు. ఇదే కేసులో రీసెంట్‌గానే సిట్‌ హరీష్‌ రావును విచారించింది. ఇప్పుడు కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. దీంతో హరీష్‌ను అధికారులు ఏం అడిగారు.. రేపు సిట్‌ విచారణ నేపథ్యంలో తమ వ్యూహం గురించి KCRతో చర్చించేందుకు ఎర్రవెల్లికి వెళ్లనున్నారు కేటీఆర్‌.