కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. ముందుగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తాం అంటూ.. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో, ప్రకటనల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది.
