YS Viveka Case: కోడి కత్తి కేసు తేలదు.. వివేకా హత్య కేసు వీడదు.. నాలుగేళ్లైనా పూర్తవ్వని విచారణ?

ఏపీలో రెండు హై ప్రొఫైల్ కేసులు నాలుగేళ్లుగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకటి కోడి కత్తి కేసు.. రెండోది వివేకా హత్య కేసు. రాష్ట్రంలో అత్యంత సంచలనం సృష్టించిన ఈ రెండు కేసులు ఎటూ తేలడం లేదు. అందరికీ అన్నీ తెలుసు. కానీ, న్యాయమే జరగదు. వివేకాది హత్య అని అందరికీ తెలుసు. ఈ కేసులో పాత్రధారుల గురించి అవగాహన ఉంది. కానీ, సీబీఐ కూడా ఈ కేసును ఇప్పటికీ పరిష్కరించలేకపోతోంది. ఇక కోడి కత్తి కేసు కూడా అంతే. జగన్‌పై హత్యాయత్నంగా నమోదైన ఈ కేసు ఇంకా ఏమీ తేలకుండానే మిగిలిపోయింది. అసలు ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ కేసుల విషయంలో రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి.

Post Published By: Srikar Creator
Updated : 18 April 2023, 2:30 PM IST

Published : 
  • 18 April 2023, 2:30 PM IST

Exit mobile version