ఒకవైపు పెళ్లి బాజాలు.. మరోవైపు ప్రాణాలు తీసే పక్కా ప్లాన్.. లవర్ కోసం కాబోయే భర్తనే 400 అడుగుల లోయలోకి తోసేసిన మైండ్ బ్లోయింగ్ క్రైమ్ స్టోరీ ఇది. పూణేకు చెందిన ఒక పెద్ద బిజినెస్‌మెన్ మర్డర్ కేసులో.. నిందితుడు వేసిన 10 గంటల 'ఘోస్ట్ స్ట్రాటజీ' వింటే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. అసలు పోలీస్ లొకేషన్ ట్రాక్ చేయకుండా.. తన ఫోన్ ఇంట్లో పెట్టి.. ఏకంగా ఒక అదృశ్య ఆత్మలా మారి చేసిన ఈ ఘోర హత్య ఎలా దొరికిపోయింది? పూణేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌కు, సియా గోయల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఇంట్లో వాళ్ళు కుదిర్చిన పెళ్లి ఇది. కానీ సియాకు మాత్రం ఆల్రెడీ చేతన్ చౌదరి అనే ప్రియుడు ఉన్నాడు. ఈ అరేంజ్డ్ మ్యారేజ్‌ను ఆపడానికి ఆ ఇద్దరు లవర్స్ కలిసి ఒక డెడ్లీ స్కెచ్ వేశారు. లోహగఢ్ కోటను క్రైమ్ స్పాట్‌గా ఎంచుకున్నారు. జూన్ 18 ఉదయం.. కేతన్ తన కాబోయే భార్య సియాను కార్‌లో పికప్ చేసుకుని లోహగఢ్ కోట వైపు బయలుదేరాడు. కానీ అదే సమయంలో అక్కడ మరో డార్క్ ప్లాన్ నడుస్తోంది.
ఇక్కడే చేతన్ చౌదరి తన 10 గంటల 'ఘోస్ట్ స్ట్రాటజీ'ని ప్లే చేశాడు. పోలీసులు తనను జిపిఎస్ ద్వారా పట్టుకోకూడదని ఒక పక్కా ప్లాన్ వేసుకున్నాడు.ఉదయం 7 గంటలు: చేతన్ తన మొబైల్ డేటాను పూర్తిగా ఆఫ్ చేసేశాడు. దీనివల్ల సెల్ టవర్స్ అతని లొకేషన్‌ను ట్రాక్ చేయలేవు.
ఉదయం 8 గంటలు: ఒక దొంగ అలిబి క్రియేట్ చేశాడు. తన పర్సనల్ ఫోన్‌ను తన షాప్‌లోనే వదిలేసి, వర్కర్స్‌కు ఇచ్చాడు. ఎవరి ఫోన్ వచ్చినా తానే షాప్‌లో ఉన్నట్లు మాట్లాడమన్నాడు.మధ్యాహ్నం 12 గంటలు: డిజిటల్ ప్రపంచానికి కనపడకుండా.. తన వర్కర్ ఫోన్ వాడుతూ సీక్రెట్‌గా లోహగఢ్ కోటకు చేరుకున్నాడు.
మధ్యాహ్నం 2 గంటలు: అక్కడ ఎండ 33 డిగ్రీలు ఉన్నా.. సిసిటివి కెమెరాలకు ముఖం కనిపించకూడదని ఒక లావుపాటి వింటర్ హూడీ వేసుకుని కేతన్ వెనకాలే ఫాలో అయ్యాడు.
మధ్యాహ్నం 2:30 గంటలు: కోటలోని వించు కాటా ప్రాంతానికి రాగానే.. ప్లాన్ ప్రకారం సియా కింద కూర్చుని చేతన్‌కు సిగ్నల్ ఇచ్చింది. అంతే. వెనకాలే పొంచి ఉన్న చేతన్.. ఒక్కసారిగా వచ్చి కేతన్‌ను 400 అడుగుల లోయలోకి తోసేశాడు.
సాయంత్రం 5:40 గంటలు: సరిగ్గా 10 గంటల 40 నిమిషాల పాటు డిజిటల్ వరల్డ్ నుంచి మాయమైపోయిన చేతన్.. మళ్లీ ఇంటర్నెట్ ఆన్ చేసి, తనేమీ ఎరగనట్టు సైలెంట్ అయిపోయాడు. హత్య జరిగిన వెంటనే సియా.. కేతన్ తల్లికి ఫోన్ చేసి కాబోయే భర్త ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయాడంటూ డ్రామా ఆడింది. పోలీసులు బాడీని రికవర్ చేశారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్, బంధువులు ఆ క్రైమ్ స్పాట్‌కు వెళ్లి చూస్తే.. అది అంత ఈజీగా జారిపడే చోటు కాదని అర్థమైంది. అలాగే సియా ఫోన్ ఎప్పుడూ బిజీగా ఉండడం, చేతన్ అనే పేరును పదే పదే వాడడంతో తండ్రికి అనుమానం వచ్చి ఫిర్యాదు చేశారు.
ఇక పోలీసులు రంగంలోకి దిగారు. చేతన్ ఫోన్ 10 గంటల పాటు కంటిన్యూస్‌గా ఇంటర్నెట్ ఆఫ్ అయి ఉండడం ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు పెద్ద క్లూగా మారింది. డౌట్ వచ్చి ఆ టైంలో వచ్చిన కాల్స్ డేటా తీస్తే.. మాట్లాడింది చేతన్ కాదు, అతని వర్కర్ అని తేలిపోయింది. అన్నిటికంటే పెద్ద బ్లండర్.. ఆ మండే ఎండలో వింటర్ హూడీ వేసుకుని తిరిగిన చేతన్ వింత రూపాన్ని సిసిటివి కెమెరాలు స్పష్టంగా క్యాప్చర్ చేశాయి. దాంతో ఆ ఘోస్ట్ ప్లాన్ కాస్తా అట్టర్ ఫ్లాప్ అయి.. లవర్స్ ఇద్దరూ బుక్కయిపోయారు. ఎంత పక్కాగా ప్లాన్ వేసినా.. తప్పు చేస్తే ఏదో ఒక క్లూ దొరుకుతుందని ఈ కేసు మరోసారి నిరూపించింది.