Top story: ఏది న్యాయం? ఏది ధర్మం? నా చెల్లిని చంపిన వాడిని నేను చంపేశా….తప్పేముంది? జనం ఇనిస్టెంట్ జస్టిస్ కోరుకుంటున్నారా?

కంటికి కన్ను.... పంటికి పన్ను సిద్ధాంతాన్ని జనం కోరుకుంటున్నారా? నా చెల్లిని వాడు చంపేశాడు .... అందుకే నేను వాడిని చంపేశా. నన్ను అర్థం చేసుకోండి అంటూ ఓ హంతకుడు జనానికి ఓ ధర్మ సందేహాన్ని పెట్టాడు.

Post Published By: dialnews
Updated : 19 September 2026, 12:36 PM IST

కంటికి కన్ను.... పంటికి పన్ను సిద్ధాంతాన్ని జనం కోరుకుంటున్నారా? నా చెల్లిని వాడు చంపేశాడు .... అందుకే నేను వాడిని చంపేశా. నన్ను అర్థం చేసుకోండి అంటూ ఓ హంతకుడు జనానికి ఓ ధర్మ సందేహాన్ని పెట్టాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దీనిపైనే చర్చ జరుగుతుంది. జగిత్యాలలో వైష్ణవి అనే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ నీ ఆమె భర్త హరిబాబు ఈ ఏడాది మార్చి 17 న హత్య చేశాడు. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భిణీ. యూట్యూబర్ గా ఎంతో కొంత పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి 18 ఏళ్లకే హరిబాబు తో ప్రేమలో పడింది. పెళ్లయిన తర్వాత కట్నం చాలలేదని కోపంతో ఆమెను హత్య చేశాడు హరిబాబు. అయితే అసలు కారణం అది కాదని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా వైష్ణవి కోస్తున్న పాపులారిటీని హరిబాబు తట్టుకోలేకపోయాడని.... కేవలం అసూయతోనే ఆమెను హత్య చేశాడని స్థానికులు చెప్తూ ఉంటారు.

ఈ మర్డర్ కేసులో హరిబాబు జైలుకెళ్లాడు. కొద్దిరోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చాడు. సొంతూరు జగిత్యాల్ లో ఉంటే ముప్పు ఉందని కొద్ది రోజులు ఏపీకె వెళ్లి వచ్చాడు. నిజామాబాదులో అయితే భయం లేకుండా బ్రతకొచ్చు అనుకున్నాడు. కానీ మృత్యు వెంటాడుతోందని గ్రహించలేకపోయాడు. వైష్ణవి అన్న సంతోష్ హత్య జరిగిన సరిగ్గా ఏడు నెలలకి నిజామాబాద్ లో హరిబాబుని వెంటాడి 30 సెకండ్లలో చంపేశాడు.హరిబాబుని సంతోష్ హత్య చేయడాన్ని... చాలా ఆశ్చర్యంగా సంతోష్ భార్య సమర్థించింది. నాలుగు నెలల గర్భిణీ నీ అన్యాయంగా హరిబాబు పొట్టనపెట్టుకున్నాడు. వైష్ణవిఏ సతీష్ ద్వారా ఈ పగ తీర్చుకుంది అని చెప్పుకొచ్చిందామే. భర్త చేసిన హత్యను అర్థం చేసుకోవాలని ఆమె చెప్పడం బట్టి ఆ కుటుంబం ఎంతగా రగిలిపోతోందో అర్థమవుతుంది.

మేం 12 మంది అన్నదమ్ములం. వైష్ణవి ఒక్కరితే చెల్లి. ఆమె చచ్చిపోయిన రోజే హరిబాబుని ఏసయ్యాలని అనుకున్నాం. వైష్ణవి చావుని సంతోష్ తట్టుకోలేకపోయాడు. అందుకే తెగించాడు... అని చెప్తున్నాడు సంతోష్ అన్న.నా కొడుకు వైష్ణవి ని చంపి ఉండొచ్చు. కానీ కారణాలు తెలుసుకోకుండా ఇలా ప్రతీకారం తీర్చుకుంటారా... అని బోరున వినిపిస్తోంది హరిబాబు తల్లి.చెల్లిని చంపిన వాడిని ఏడు నెలల తిరగకుండా చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు సంతోష్. అయితే సంతోష్ చేసిన పనికి అతడి కుటుంబం అన్యాయం అయిపోయింది. భార్యా పిల్లలు రోడ్డున పడ్డారు. రేపటి నుంచి పోలీస్ స్టేషన్ల ,కోర్టుల చుట్టూ తిరగాలి. రోజు కూలీ పై బతికే బతుకులు ఇలా హత్య నేరాలు లో ఇరుక్కుని.... తమ జీవితాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు. హరిబాబుని సతీష్ చంపడం తప్పు లేదని... వాదించేవారు లేకపోలేదు. కానీ జనం ఇలా ఎవరికి వాళ్లే ఇష్టమైన శిక్షలు విధించుకుంటూ పోతే సమాజంలో అంతకులే మిగులుతారు. ఇలాంటి విపరీత ఆలోచనతో చనిపోయిన చెల్లి కోసం తన జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు సతీష్.

Published : 
  • 19 September 2026, 12:36 PM IST