Top story: హైదరాబాద్ లోనే ఎలన్ మస్క్ కు అమ్మ మొగుళ్ళు.. ఇండియా SpaceX.. అమెరికాకు ఫ్రెండ్స్ చాలెంజ్ ఇస్రో ఉద్యోగాలను వదిలేసిన ఇద్దరు మిత్రుల కథ!

అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశం ఇన్నాళ్లూ ఇస్రో ద్వారా అద్భుతాలు సృష్టించింది. కానీ సరిగ్గా ఇప్పుడు, మన అంతరిక్ష చరిత్రలో ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖించబడింది.

Post Published By: dialnews
Updated : 21 July 2026, 8:34 PM IST

అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశం ఇన్నాళ్లూ ఇస్రో ద్వారా అద్భుతాలు సృష్టించింది. కానీ సరిగ్గా ఇప్పుడు, మన అంతరిక్ష చరిత్రలో ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖించబడింది. అవును.. భారతదేశానికి తన స్వంత 'SpaceX'.. తన స్వంత 'ఎలన్ మాస్క్' దొరికేసారు. భారత గడ్డపై నుండి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1'. హైదరాబాద్‌కు చెందిన 'స్కైరూట్ ఏరోస్పేస్' సృష్టించిన ఈ మహా సంచలనానికి ప్రధాని మోడీ నుంచి.. సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి లాంటి ప్రముఖుల వరకు సలాం కొట్టారు. "భారతదేశం నక్షత్రాలను అందుకోవడమే కాదు.. అంతరిక్షాన్ని శాసిస్తోంది" అని కొనియాడారు. అసలు ఏంటా విక్రమ్-1 కథ? దీని వెనుక ఉన్న ఆ ఇద్దరు భారతీయ యువ శాస్త్రవేత్తలు ఎవరు?

ఈ చారిత్రాత్మక విజయానికి కారణమైన ఆ స్టార్టప్ పేరే స్కైరూట్ ఏరోస్పేస్ (. దీనిని స్థాపించింది మరెవరో కాదు.. మన భారతదేశానికి చెందిన ఇద్దరు అద్భుతమైన యువకులు - పవన్ కుమార్ చందన మరియు భరత్ దాకా. వీరిద్దరూ ప్రతిష్టాత్మకమైన ఐఐటీ లలో చదువుకుని, ఆ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) లో శాస్త్రవేత్తలుగా దేశానికి సేవలు అందించారు. పవన్ కుమార్ చందన ఇస్రోలో సైంటిస్ట్‌గా రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌పై పనిచేశారు. భారతదేశంలో ప్రైవేట్ రంగానికి కూడా అంతరిక్ష రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని నమ్మిన వీరు, తమ ఇస్రో ఉద్యోగాలను వదిలేసి, 2018లో హైదరాబాద్ కేంద్రంగా ఈ 'స్కైరూట్' సంస్థను స్థాపించారు.

వీరు నాడు కన్న కలలే నేడు 'విక్రమ్-1' రూపంలో నింగిలోకి దూసుకెళ్లాయి. పవన్ కుమార్ చందన మరియు భరత్ దాకా నేతృత్వంలో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రయోగానికి 'మిషన్ ఆగమనం' అని పేరు పెట్టారు. ఆగమనం అంటే రాక అని అర్థం. అంటే గ్లోబల్ కమర్షియల్ స్పేస్ మార్కెట్లోకి భారత ప్రైవేట్ రంగం అధికారికంగా అడుగుపెట్టిందని దీని అర్థం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ ఏడు అంతస్తుల పొడవైన విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ప్రధానంగా ఒక టెస్ట్ ఫ్లైట్. కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించడానికి ముందు, రాకెట్ సామర్థ్యాన్ని, సాంకేతికతను పరీక్షించడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

ఈ మిషన్ విజయవంతం కావడంతో, ప్రైవేట్ రంగంలో పూర్తి స్థాయి కమర్షియల్ రాకెట్లను కక్ష్యలోకి పంపిన అతికొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది. విక్రమ్-1 రాకెట్ సాంకేతికంగా ఎంతో అధునాతనమైనది. ఇది లో ఎర్త్ ఆర్బిట్ లోకి, అంటే భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి దాదాపు 350 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను అత్యంత సులువుగా మోసుకెళ్లగలదు. దీని ప్రొపల్షన్ సిస్టమ్ చాలా ప్రత్యేకం. ఇందులో మూడు సాలిడ్-ఫ్యూయల్ స్టేజీలు ఉన్నాయి.

అయితే అన్నిటికంటే హైలైట్ ఏంటంటే.. రాకెట్ చివరన ఉండే నాలుగో స్టేజ్. దీనిని ఆర్బిటల్ అడ్జస్ట్‌మెంట్ మోడ్యూల్ అంటారు. ఇది లిక్విడ్ ఫ్యూయల్‌తో పనిచేస్తుంది. అంతరిక్షంలోక వెళ్లాక సాటిలైట్లను ఖచ్చితమైన స్థానంలో, సరైన కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ఈ OAM టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. పవన్ మరియు భరత్ ల పర్యవేక్షణలో మన భారతీయ ప్రైవేట్ ఇంజనీర్లు ఇంతటి క్లిష్టమైన సాంకేతికతను తయారు చేయడం నిజంగా గర్వకారణం. ఈ విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్‌లో శాటిలైట్లతో పాటు అంతరిక్షంలోకి వెళ్లిన కొన్ని వస్తువులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

అందులో అత్యంత ప్రత్యేకమైనది.. గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తన చేత్తో రాసిన ఒక పోస్ట్‌కార్డు.. ఆ కార్డుపై ప్రధాని మోదీ "వందేమాతరం" అనే పవర్ ఫుల్ పదాలను లిఖించారు. దేశభక్తిని చాటిచెప్పే ఈ చారిత్రాత్మక కార్డుతో పాటు.. స్కైరూట్ వ్యవస్థాపకులు, వారి బృందం, ఇన్వెస్టర్లు, మరియు పాలసీ మేకర్స్ రాసిన మరికొన్ని హ్యాండ్‌రిటన్ ఉపగ్రహాలు లు కూడా ఈ రాకెట్ ద్వారా స్పేస్‌లోకి ప్రయాణించాయి. నవభారత ఆత్మవిశ్వాసానికి, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి ఈ ప్రయోగం ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఎలన్ మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఏకఛత్రాధిపత్యం చలాయిస్తోంది. కానీ విక్రమ్-1 విజయంతో భారత్ ఆ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా యూరప్ మరియు ఇతర ఆసియా దేశాల కస్టమర్లకు అత్యంత తక్కువ ఖర్చుతో, అంతే నమ్మకమైన ప్రైవేట్ లాంచ్ సేవలను అందించడానికి స్కైరూట్ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఇండియన్ స్పేస్ పాలసీ 2023 మద్దతుతో, ఇస్రో ల్యాబ్స్ సహాయంతో పవన్ కుమార్ మరియు భరత్ దాకా మన దేశంలో ఎలన్ మాస్క్ రేంజ్ స్టార్టప్స్ రావడం సాధ్యమేనని నిరూపించారు.

Published : 
  • 21 July 2026, 8:34 PM IST