ఇంటర్నెట్ ప్రపంచంలో గూగుల్ అంటే ఒక అజేయమైన సామ్రాజ్యం. మనం ఏం తింటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, రాత్రిపూట ఫోన్ లో ఏం వెతుకుతున్నాం.. ఇలా మన జాతకం మొత్తం గూగుల్ దగ్గర పక్కాగా రికార్డ్ అయి ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశమైనా సరే గూగుల్ ముందు మోకాళ్ల మీద నిలబడాల్సిందే అనుకుంటున్న తరుణంలో.. గూగుల్ సామ్రాజ్యానికి సింహస్వప్నం లాంటి ఒక మొనగాడు ఎంట్రీ ఇచ్చాడు! గూగుల్‌కు అమ్మ మొగుడు అనిపించుకునే రేంజ్‌లో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక టెక్నాలజీ ఇప్పుడు గూగుల్ పీఠాన్ని కదిలిస్తోంది.అదే.. 'క్వాంట్' సెర్చ్ ఇంజన్. ఇప్పటివరకు గూగుల్ చూపించిన డిజిటల్ దాదగిరీకి చెక్ పెడుతూ, యూరోపియన్ పార్లమెంట్ గూగుల్‌ను నడిబజార్లో పక్కన పెట్టేసి.. ఈ 'క్వాంట్'ను తమ అఫీషియల్ సెర్చ్ ఇంజన్‌గా మార్చేసింది. అసలు ఏంటీ క్వాంట్? గూగుల్ కంటే ఇందులో ఉన్న తోపు టెక్నికల్ పాయింట్స్ ఏంటి..? ముందుగా మనం ఒక టెక్నికల్ పాయింట్ అర్థం చేసుకోవాలి.
గూగుల్ అనేది మనకు ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు నటిస్తుంది కానీ, అసలు నిజం ఏంటంటే.. అక్కడ ప్రొడక్ట్ గూగుల్ కాదు, మనమే. మనం గూగుల్‌లో ఒక వస్తువు గురించి వెతికితే.. మరుసటి నిమిషం నుండి మన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో దానికి సంబంధించిన యాడ్స్ పడుతుంటాయి. అంటే గూగుల్ మన 'డేటా'ను దొంగతనంగా ట్రాక్ చేసి, కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటూ బిలియన్ల డాలర్లు సంపాదిస్తోంది. కానీ, ఫ్రాన్స్ తీసుకొచ్చిన 'క్వాంట్' కథ వేరు.దీని టెక్నికల్ ట్యాగ్‌లైన్ ఏంటో తెలుసా? "ది సెర్చ్ ఇంజన్ దట్ రెస్పెక్ట్స్ యువర్ ప్రైవసీ" అంటే నీ ప్రైవసీని గౌరవించే సెర్చ్ ఇంజన్. క్వాంట్ అనేది మీ 'కుకీస్' ను సేవ్ చేయదు, మీ బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేయదు, అసలు మీ పర్సనల్ ఐడెంటిటీని అది అస్సలు రికార్డ్ చేయదు. అంటే మీరు ఏం వెతికారు అనేది మీకూ ఆ కంప్యూటర్‌కు మాత్రమే తెలుస్తుంది తప్ప, క్వాంట్ ఓనర్లకు కూడా తెలియదు. ఇక్కడే క్వాంట్ గూగుల్‌కు పెద్ద మొగుడు అనిపించుకుంది. ఇక టెక్నికల్ మైండ్ గేమ్‌లోకి వెళ్తే.. గూగుల్ మనల్ని ఒక 'ఫిల్టర్ బబుల్' లో బంధిస్తుంది.
అంటే మన పాత అలవాట్లను బట్టి, మనకు నచ్చిన వార్తలను, మనకు నచ్చిన ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్‌లో ఉన్న నిజమైన ప్రపంచం మనకు కనిపించదు. కానీ క్వాంట్ అల్గారిథమ్ ఏం చేస్తుందో తెలుసా? అది నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. నువ్వు రీసెర్చ్ చేస్తే ప్రపంచంలో ఏది బెస్ట్ కంటెంటో అది మాత్రమే చూపిస్తుంది తప్ప, నీ పర్సనల్ హిస్టరీని బట్టి రిజల్ట్స్‌ను మార్చదు. దీనివల్ల హ్యాకింగ్ భయం ఉండదు, డేటా లీక్ అయ్యే ఛాన్సే లేదు. అందుకే యూరోపియన్ పార్లమెంట్‌లోని పెద్ద పెద్ద లీడర్లు, ఇంటర్నేషనల్ ఐటీ నిపుణులు.. గూగుల్ లాంటి అమెరికన్ యాప్స్ మన కంప్యూటర్లలో ఉంటే మన దేశ రహస్యాలన్నీ వాషింగ్టన్‌కు చేరిపోతాయని గ్రహించారు.వెంటనే గూగుల్ ముఖం మీద కొట్టి.. 100% సేఫ్ అయిన 'క్వాంట్'ను వాడటం మొదలుపెట్టారు.
ఈ దెబ్బతో అమెరికా టెక్ దిగ్గజాల గుండెల్లో బేజారు మొదలైంది. ఎందుకంటే యూరప్ మార్కెట్ అనేది గూగుల్‌కు ఒక బంగారు బాతు లాంటిది. అక్కడ గూగుల్‌కు 90 శాతానికి పైగా మోనోపలీ అంటే ఏకఛత్రాధిపత్యం ఉంది. ఇప్పుడు యూరప్ దేశాలన్నీ క్వాంట్ వైపు మొగ్గు చూపితే గూగుల్ షేర్లు పాతాళానికి పడిపోవడం ఖాయం. పైగా, క్వాంట్ కేవలం ఒక వెబ్‌సైట్ మాత్రమే కాదు.. ఫ్రాన్స్ మరియు జర్మనీ దేశాల ప్రభుత్వాలు దీని వెనుక భారీగా నిధులు కుమ్మరిస్తున్నాయి.తమ సొంత యూరోపియన్ సంస్కృతిని, డేటా భద్రతను కాపాడుకోవడానికి క్వాంట్‌ను ఒక డిజిటల్ ఆయుధంగా వాడుతున్నాయి. గూగుల్ యాడ్స్ ద్వారా వచ్చే విసుగు, స్పామ్ మెసేజ్‌లు ఏవీ క్వాంట్‌లో ఉండవు. ప్యూర్ కంటెంట్, క్లీన్ ఇంటర్‌ఫేస్.. ఇదీ ఈ ఫ్రాన్స్ పులి యొక్క అసలు నైజం. చూశారుగా బాస్.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే గూగుల్ మాత్రమే అనుకున్నారు, కానీ ఇప్పుడు గూగుల్ తాత లాంటి క్వాంట్ మార్కెట్లోకి వచ్చి రూల్స్ మార్చేస్తోంది. టెక్నాలజీ ప్రపంచంలో మోనోపలీ నడిపిన ఏ ఒక్కడూ చరిత్రలో మిగలలేదు, గూగుల్‌కు కూడా ఆ టైమ్ దగ్గర పడిందని ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.
No related posts found.