ఆపిల్ లవర్స్‌కు ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్. సాధారణంగా ఆపిల్ కంపెనీ ప్రతి ఏటా ఐఫోన్లలో చిన్న చిన్న అప్‌గ్రేడ్స్ మాత్రమే ఇస్తుందనే విమర్శ ఉంది. కానీ, రాబోయే రోజుల్లో ఆపిల్ తన హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజైన్ ఓవర్‌హాల్‌కు తెరలేపబోతోంది. ఆపిల్ ఐఫోన్ లాంచ్ అయి 20 ఏళ్లు పూర్తి కాబోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఒక అద్భుతమైన యానివర్సరీ ఎడిషన్‌ను తీసుకురావడానికి కంపెనీ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే 'iPhone 20 Pro Max' కి సంబంధించిన కొన్ని షాకింగ్ లీక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఐఫోన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు 7-ఇంచుల బోర్డర్‌లెస్ డిస్ప్లేతో ఈ ఫోన్ రాబోతోందట. అసలు ఆపిల్ ల్యాబ్స్‌లో ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి? దీని డిజైన్ ఎలా ఉండబోతోంది?
చైనాకు చెందిన ప్రముఖ టెక్ టిప్‌స్టర్ 'Digital Chat Station' లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఆపిల్ కంపెనీ ప్రస్తుతం తన సీక్రెట్ ల్యాబ్స్‌లో 6.96 ఇంచుల భారీ డిస్ప్లే ప్యానెల్‌ను టెస్ట్ చేస్తోంది. దీనినే మార్కెట్లోకి తెచ్చేటప్పుడు రౌండ్ అప్ చేసి "7-ఇంచ్ డిస్ప్లే" గా ఆపిల్ ప్రమోట్ చేసే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9 ఇంచుల డిస్ప్లేతో వస్తోంది కాబట్టి, స్క్రీన్ సైజులో వచ్చే మార్పు చాలా స్వల్పంగానే ఉంటుంది. కానీ, ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు యాస్పెక్ట్ రేషియో మాత్రం కంప్లీట్ డిఫరెంట్‌గా ఉండబోతోంది. ప్రస్తుతానికి ఇది ప్రోటోటైప్ దశలోనే ఉంది. ఒకవేళ ఈ టెస్టింగ్ గనుక సక్సెస్ అయితే, ఐఫోన్ హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ డిస్ప్లే కలిగిన ఫోన్‌గా రికార్డు సృష్టిస్తుంది.
అయితే ఈ ఫోన్లో కేవలం స్క్రీన్ సైజ్ పెరగడం మాత్రమే విశేషం కాదు.. అసలు ట్విస్ట్ దాని డిజైన్‌లో ఉంది. ఈ యానివర్సరీ ఐఫోన్ నాలుగు వైపులా సరికొత్త 'కర్వ్డ్ గ్లాస్' డిజైన్‌తో రాబోతోందని టాక్. అంటే ఫోన్‌కు ఎలాంటి మెటల్ బెజెల్స్ లేదా అంచులు ఉండవు. ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటే.. ఒక సాలిడ్ గ్లాస్ ముక్కను పట్టుకున్నట్లే ఉంటుంది. ఆపిల్ కంపెనీ ఎప్పటి నుంచో కలలుగంటున్న "ఫుల్ గ్లాస్ ఐఫోన్" విజన్ దీనితో నిజం కాబోతోంది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ 'బ్లూమ్‌బెర్గ్' కూడా ఆపిల్ ప్రస్తుతం రెండు డిఫరెంట్ యానివర్సరీ ప్రోటోటైప్స్ పైన చాలా వేగంగా వర్క్ చేస్తోందని కన్ఫర్మ్ చేసింది.
ఇక్కడ టెక్ సర్కిల్స్‌లో ఒక పెద్ద సస్పెన్స్ నడుస్తోంది. ఈ ఫోన్ పేరు ఏం పెడతారు? ఆపిల్ గతంలో తన 10వ వార్షికోత్సవం సందర్భంగా 'iPhone 9' ని స్కిప్ చేసి నేరుగా 'iPhone X' (ఐఫోన్ 10) ని లాంచ్ చేసి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఇప్పుడు 20వ వార్షికోత్సవం.. 2027 లో రాబోతుండటంతో.. ఆపిల్ మరోసారి 'iPhone 19' సిరీస్‌ను పూర్తిగా స్కిప్ చేసి, నేరుగా 'iPhone 20' సిరీస్‌ను మార్కెట్లోకి తెస్తుందా అనే చర్చ నడుస్తోంది. లేదా దీనిని ఒక స్పెషల్ ఎడిషన్ లాగా "iPhone XX" లేదా సరికొత్త పేరుతో పిలుస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆపిల్ అధికారికంగా ప్రకటించే వరకు ఇది ప్యూర్ గెస్ వర్క్ మాత్రమే.
అయితే, ఈ యానివర్సరీ ఐఫోన్ మార్కెట్లోకి రావడానికి ఇంకా ఒక ఏడాదికి పైగా టైమ్ ఉంది. ఈ లోగా.. అంటే ఈ ఏడాది సెప్టెంబర్ 2026 లో ఆపిల్ నుండి మోస్ట్ అవేటెడ్ 'iPhone 18' సిరీస్ రాబోతోంది. ఇందులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్‌తో పాటు ఆపిల్ హిస్టరీలోనే మొట్టమొదటి 'ఫోల్డబుల్ ఐఫోన్' కూడా లాంచ్ కానుంది. ఈ ఐఫోన్ 18 ప్రో మోడల్స్ సరికొత్త A20 చిప్, అప్‌గ్రేడెడ్ కెమెరాలు మరియు సరికొత్త డిస్ప్లే టెక్నాలజీతో రాబోతున్నాయి. అయితే ఈ అప్‌గ్రేడ్స్ కారణంగా ఐఫోన్ 18 సిరీస్ ధరలు మునుపటి కంటే భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆపిల్ తన 20 ఏళ్ల మైలురాయిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎలాంటి భారీ ప్లాన్స్ వేస్తోందో. ఒకవేళ 7-ఇంచుల కంప్లీట్ బోర్డర్‌లెస్ గ్లాస్ ఐఫోన్ గనుక వస్తే స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ మొత్తం మారిపోవడం ఖాయం.