Top story:కిడ్నీలతో పాటు ఇల్లు కూడా అమ్మేయాలా ? యాపిల్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ ధరపై నెటిజెన్ల ఫన్నీ మీమ్స్‌..!

10 కంపెనీలు కలిసి 10 రకాల ప్లాన్లు వేసి 10 మోడళ్ల ఫోన్లు రిలీజ్‌ చేస్తే.. సింపుల్‌గా ఒకే ఒక్క మోడల్‌ రిలీజ్‌ చేసి ఆ పది ఫోన్లను పక్కకు నెట్టే సత్తా మార్కెట్‌లో కేవలం ఐఫోన్‌కు మాత్రమే ఉంది. అందుకే యాపిల్‌ నుంచి ఫోన్‌ రిలీజ్‌ అవుతోంది అంటే ప్రపంచం మొత్తం ఆ కొత్త ఫీచర్స్‌ కోసం ఎదురుచూస్తోంది.

Post Published By: dialnews
Updated : 11 September 2026, 7:53 PM IST

10 కంపెనీలు కలిసి 10 రకాల ప్లాన్లు వేసి 10 మోడళ్ల ఫోన్లు రిలీజ్‌ చేస్తే.. సింపుల్‌గా ఒకే ఒక్క మోడల్‌ రిలీజ్‌ చేసి ఆ పది ఫోన్లను పక్కకు నెట్టే సత్తా మార్కెట్‌లో కేవలం ఐఫోన్‌కు మాత్రమే ఉంది. అందుకే యాపిల్‌ నుంచి ఫోన్‌ రిలీజ్‌ అవుతోంది అంటే ప్రపంచం మొత్తం ఆ కొత్త ఫీచర్స్‌ కోసం ఎదురుచూస్తోంది. ఈ ఏడాది యాపిల్‌ ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బ్రాండ్‌ న్యూ ఐఫోన్‌ 18 సిరీస్‌ను లాంఛ్‌ చేసింది యాపిల్‌ సంస్థ. అయితే ఈ ఏడాది మాత్రం మరింత స్పెషల్‌గా యాపిల్‌ కంపెనీ నుంచి ఫప్ట్‌ జనరేషన్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ను రిలీజ్‌ చేసి టెక్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. యాపిల్ అందించిన ఈ ఫస్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్‌ డ్యుయో' టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఫోల్డ్ తెరిచినప్పుడు 7.6 అంగుళాల పెద్ద ఇన్నర్ డిస్‌ప్లేతో ట్యాబ్‌లా మారుతుంది. మడతపెట్టినప్పుడు 5.4 అంగుళాల అవేకన్ ఔటర్ డిస్‌ప్లే అందుబాటులో ఉంటుంది. యాపిల్ అత్యంత వేగవంతమైన A20 ప్రో చిప్‌సెట్‌తో పాటు, AI ఫీచర్లు ఉన్న 48MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను దీనిలో జతచేశారు. ఫోల్డ్‌ ఓపెన్‌ చేసినప్పుడు స్క్రీన్‌ మీద కెమెరా కనిపించదు. కానీ ఫ్రంట్‌ క్యామ్‌ ఆన్‌ చేయగానే సడెన్‌గా కెమెరా స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. ఈ హిడెన్‌ ఫీచర్‌ చూసి కాంపిటీటర్‌ కంపెనీలు కూడా షాకైపోతున్నాయి. దీంట్లో మరో హైలెట్‌ దీని స్లిమ్‌ డిజైన్‌. ఫోల్డ్ చేసినా సరే ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలోకెల్లా అత్యంత సన్నని డిజైన్‌తో ఇది మార్కెట్‌లోకి వచ్చింది. అయితే ఈ ఫోన్‌ ఫీచర్స్‌ కంటే దీని ధర ఇప్పుడు మార్కెట్‌లో ట్రెండ్‌ అవుతోంది. భారత్‌లో ఐఫోన్ డ్యుయో బేస్ వేరియంట్ 256GB ధర 2,99,900. టాప్ వేరియంట్ 2TB ధర ఏకంగా 4,49,900గా నిర్ణయించారు.

ఇంపోర్ట్‌ డ్యూటీస్‌, ట్యాక్స్‌లు అన్నీ కలిపి ఇండియాలో ధర ఇంకాస్త ఎక్కువే ఉండే ఛాన్స్‌ ఉంది. దుబాయ్‌లో ఈ ఫోన్‌ సుమారు 2.20 లక్షలు, థాయిలాండ్‌లో 2.30 లక్షలకే లభిస్తోంది. ఈ ధర చూసి సోషల్ మీడియాలో మీమ్స్‌ బాంబుల్లా పేలుతున్నాయి. ఒకప్పుడు ఐఫోన్‌ కొనాలంటు చాలా మంది కిడ్నీలు అమ్మేవాళ్లు.. ఇప్పుడు ఈ డ్యుయో ఫోన్‌ కొనాలంటే ఇల్లు కూడా అమ్మాలేమో అంటూ నెజిటన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోన్ చేతిలో ఉంటే సెక్యూరిటీ గార్డును వెంట బెట్టుకుని తిరగాలేమో అని కొందరు, ఇంట్లో దొంగలు పడితే బంగారం వదిలేసి ఫోన్ ఎత్తుకెళ్తారేమో అంటూ మరికొందరు మీమ్స్‌ వేస్తున్నారు. మొత్తానికి సాంకేతిక పరంగా ఐఫోన్ డ్యుయో ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మార్వెల్ అయినప్పటికీ.. దాని ధర చిన్నపాటి ప్లాటుకు, ఎంట్రీ లెవెల్‌ కారుకు సమానంగా ఉందని బాధ పడుతున్నారు యాపిల్‌ లవర్స్‌.

Published : 
  • 11 September 2026, 7:53 PM IST