Rapaka Vara Prasada Rao: జగన్ మీద జనసేన నేత వీరాభిమానం.. మరీ ఇంతనా.. వైరల్ అవుతోన్న ఫొటో..!

రాపాక చేసిన ఓ పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జగన్‌ మీద మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు రాపాక. తన కుమారుడి పెళ్లి పత్రికపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌, భారతి దంపతుల ఫోటోను అచ్చు వేయించారు.

Post Published By: narender Thiru
Updated : 20 May 2023, 4:47 PM IST

Rapaka Vara Prasada Rao: 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఐతే ఆ తర్వాత కొన్ని రోజులకే గ్లాస్‌ను పడేసి.. ఫ్యాన్‌ కిందకు వెళ్లి కూర్చున్నారు. అప్పటి నుంచి మొదలు.. సమయం దొరికిన ప్రతీసారి జగన్ భజన చేస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు అయితే వైసీపీ నేతలకు మించి జగన్‌ మీద పొగడ్తలు గుప్పించారు రాపాక. ఎవరయితే టికెట్ ఇచ్చారో.. ఆ పవన్‌ మీదే ఘాటు వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు రాపాక.

పవన్ ఫ్యాన్స్‌ కూడా ఆయనకు స్ట్రాంగ్‌గానే కౌంటర్లు ఇస్తున్నారు అది వేరే సంగతి! ఐతే ఇదంతా ఎలా ఉన్నా.. రాపాక చేసిన ఓ పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జగన్‌ మీద మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు రాపాక. తన కుమారుడి పెళ్లి పత్రికపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌, భారతి దంపతుల ఫోటోను అచ్చు వేయించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాపాక కొడుకు వివాహం జూన్ 7న జరగనుంది. వివాహ పత్రిక మీద.. జగన్‌, భారతి బొమ్మలు అచ్చు వేయించి.. దైవ సమానులైన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, భారతమ్మ ఆశీస్సులతో అంటూ రాయించాడు.

ఈ పెళ్లికార్డు మీద వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. జనసేన కార్యకర్తలు, అభిమానులు మాత్రం రాపాకపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను మించి భజన చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. తనకు ఇంకోసారి అవకాశం రాదని తెలిసి.. గెలవలేను అని అర్థం అయి.. జగన్‌ను మచ్చిక చేసుకునేందుకు రాపాక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలా డప్పు కొడుతున్నారంటూ.. రాపాకను గట్టిగానే ఆడుకుంటున్నారు పవన్ ఫ్యాన్‌ సోషల్‌ మీడియాలో.

 

Published : 
  • 20 May 2023, 4:47 PM IST