‘ఓజీ’ రేంజ్‌లో బాలయ్య 111…!

నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త ఒకటి ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, లీడర్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన ఓజీ గ్లింప్స్ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

Post Published By: dialnews
Updated : 30 May 2026, 8:10 PM IST

నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త ఒకటి ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, లీడర్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన ఓజీ గ్లింప్స్ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. తక్కువ నిడివితో వచ్చి, అత్యంత పవర్‌ఫుల్ ఇంపాక్ట్ చూపించిన గ్లింప్స్ ఏదైనా ఉందంటే అది డెఫినెట్‌గా ‘ఓజీ’ అనే చెప్పాలి. ఆ గ్లింప్స్ ఒక రేంజ్ బెంచ్ మార్క్‌ని సెట్ చేసింది. ఆ తర్వాత ఆ స్థాయిలో, అంతటి హైప్ క్రియేట్ చేసిన మరో గ్లింప్స్ ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. అయితే, ఇప్పుడు ఆ రికార్డులను బద్దలు కొట్టడానికి, అదే రేంజ్ విజువల్ ట్రీట్‌ను అందించడానికి టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. బాలయ్య బాబు నటిస్తున్న 111వ సినిమా నుంచి రాబోయే ఫస్ట్ గ్లింప్స్ ‘ఓజీ’ రేంజ్‌ను మించి ఉంటుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా మేకర్స్ ముంబైలో ఫుల్ బిజీగా ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ 'ఓజీ' గ్లింప్స్‌లో చూపించిన ముంబై లొకేషన్స్ లోనే, ఇప్పుడు బాలయ్య 111వ సినిమా బృందం కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఓజీ సినిమా తరహాలోనే బాలకృష్ణ సినిమా కూడా పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కుతుండటం విశేషం. ముంబై వీధుల్లో బాలయ్య మార్క్ యాక్షన్ సీక్వెన్స్, గ్యాంగ్‌స్టర్ లుక్ ఎలా ఉండబోతోందా అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నారు.నందమూరి అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అప్‌డేట్ ఏమిటంటే.. రాబోయే జూన్ 10వ తేదీన బాలయ్య బాబు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక మైండ్ బ్లోయింగ్ సాలిడ్ ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ఇందులో భాగంగానే సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. ఓజీ తరహాలోనే అత్యంత సాలిడ్ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్‌తో ఒక రేంజ్ హైప్ ఇచ్చేలా ఈ గ్లింప్స్‌ను కట్ చేస్తున్నట్లు సమాచారం.

ముంబై గ్యాంగ్‌స్టర్ డ్రామా కావడంతో విజువల్స్ చాలా రిచ్‌గా, డార్క్ థీమ్‌తో కొత్తగా ఉండబోతున్నాయని టాక్. మరి సుజీత్-పవన్ కళ్యాణ్ సెట్ చేసిన ఆ 'ఓజీ' రేంజ్ విజువల్స్ అండ్ ఇంపాక్ట్‌ను బాలయ్య 111 మేకర్స్ అందుకోగలరా లేదా అనేది చూడాలి. ఈ సినిమాకు మరో ప్రధానమైన ప్లస్ పాయింట్.. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం. బాలయ్య - థమన్ కాంబినేషన్ అనగానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాల్లో థమన్ ఇచ్చిన బిజిఎం థియేటర్లను ఎలా ఊపేసిందో మనకు తెలుసు. ఇప్పుడు ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం థమన్ ఇప్పటికే సరికొత్త వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫస్ట్ గ్లింప్స్‌కు థమన్ అందించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలైట్‌గా నిలవబోతోందని ఇన్ సైడ్ టాక్. థమన్ మార్క్ బిజిఎం తోడైతే ఈ ఫస్ట్ గ్లింప్స్ పై అంచనాలు మరింత పెరగడం ఖాయం.మొత్తానికి ముంబై లొకేషన్స్, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్, జూన్ 10 బర్త్‌డే ట్రీట్, థమన్ మ్యూజిక్.. ఇవన్నీ చూస్తుంటే బాలయ్య తన 111వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి వీరవిహారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Published : 
  • 30 May 2026, 8:10 PM IST