Mukesh Ambani is offering a laptop named Jio Book at a very low price
గతంలో జియో కీపాడ్ మొబైల్, స్మార్ట్ ఫోన్ పేరుతో వినియోగదారులను ఆకర్షించారు జియో అధినేత ముకేశ్ అంబానీ. ఇప్పుడు రూ. 16,499 కే జియో లాప్ టాప్ ను దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చారు. దీనిని జియో బుక్ గా నామకరణం చేశారు. ఇంత తక్కువ ధరలో లాప్ టాప్ అంటే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో అన్న సందేహం అందరిలో కలుగుతుంది. అందుకే దీనిపై ఒక లుక్ వేద్దాం.
జియో బుక్ ఫీచర్స్
ఇన్ని ప్రత్యేకమైన ఫీచర్లు కలిగిన లాప్ టాప్ ఇంత తక్కువ ధరలో రావడం ఇదే తొలిసారిగా చెప్పాలి. ఇప్పుడున్న ఆన్ లైన్ యుగంలో పిల్లలకు క్లాసులు వినడానికి, హోం వర్క్ చేసుకోవడానికి, ఆఫీస్ వర్క్, ఆన్ లైన్ కాలింగ్ వంటి వాటికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉంది. ఈ లాప్ టాప్ కొనుగోలు చేయాలంటే అమెజాన్, జియో స్టోర్స్, ఫ్లిప్ కార్ట్ తో పాటూ ఆప్ లైన్ మార్కెట్లోనూ ఆగస్ట్ 5 నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
T.V.SRIKAR