Ram Charan: తనే నా బలం.. చరణ్ ప్రేమ కోసం అలాంటి త్యాగం..!

ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించలేదు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి జంటగా రామ్ చరణ్ జంట నిలిచింది.

Post Published By: narender Thiru
Updated : 28 December 2023, 6:08 PM IST

Ram Charan: రామ్ చరణ్, ఉపాసన.. ది మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌ గా టాలీవుడ్ లో నిలిచిపోయారు. ఓ వైపు రామ్ చరణ్ సినిమాలతో, మరోవైపు ఉపాసన బిజినెస్, సామాజిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతుంటారు. రీసెంట్ గా ఈ జంట అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించలేదు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి జంటగా రామ్ చరణ్ జంట నిలిచింది.

Salaar: స‌లార్ ఊచ‌కోత.. 500 కోట్ల క్లబ్‌లో సలార్

తాజాగా ఈ అరుదైన గౌరవంపై ఉపాసన తనదైన స్టైల్‌లో స్పందించి అందరి మనసును గెలుచుకుంది. ఇక ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చరణ్ దంపతులు వండర్ ఫుల్ స్టిల్ ఇచ్చారు. అందులో చరణ్ ఉపాసన, పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో కనిపించి వావ్ అనిపించారు. ఉపాసన సోఫాలో కూర్చోగా.. చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చోవడం తెగ ఆకట్టుకుంటుంది. ఇక వీరిద్దరి ఫోటోను షేర్ చేస్తూ కవర్ పేజీపై ఇలా రాసుకొచ్చారు. “సూపర్ కపుల్. వీరిద్దరూ కాలేజీ స్వీట్ హార్ట్స్. ఒకరు వ్యాపారవేత్త, సంఘసంస్కర్త. మరొకరు సినిమా సూపర్ స్టార్’’ అంటూ రాసుకొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కవర్ పేజీ పై ఉపాసన స్పందించడంతో పాటు భర్తపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఉపాసన తాజాగా కవర్ పేజీపై రియాక్ట్ అయ్యారు.

అంతేకాక తన భర్త రామ్ చరణ్ పై తనకున్న ప్రేమను పంచుకుంది. ప్రతిపురుషుడి విజయం వెనక ఓ స్త్రీ ఉన్నట్లే.. ప్రతి స్త్రీ వెనక అర్థం చేసుకునే భర్త ఉంటాడని రాసుకొచ్చిన పోస్ట్ మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఉన్నత స్థితికి ఎదిగామంటే ఆ మహిళ వెనుక మద్దతు, రక్షణ ఇచ్చే పురుషుడు ఉంటాడని తన భర్తను తెగ పొగిడేసింది. అంతేకాక వైవాహిక జీవితంలో ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు.. క్లీంకార వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు వ‌చ్చాయన్న విషయాలను షేర్ చేసుకుంది ఉపాసన. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మెగా కోడలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Published : 
  • 28 December 2023, 6:08 PM IST