Rashmika : రష్మికకు అరుదైన గౌరవం..

నేషనల్ క్రష్‌ (National Crush) గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ రష్మిక మందన్న(Rashmika Mandanna).. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’ (Pushpa2) లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్‌బో’ (Rainbow) అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ చేస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 February 2024, 1:18 PM IST

నేషనల్ క్రష్‌ (National Crush) గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ రష్మిక మందన్న(Rashmika Mandanna).. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’ (Pushpa2) లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్‌బో’ (Rainbow) అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ చేస్తోంది. రీసెంట్‌గా ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే మరో లేడీ ఓరియేంటేడ్ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టింది. శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమాలోను నటిస్తోంది. చివరగా యానిమల్‌తో సాలిడ్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలకు మోస్ట్ వాంటేడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

అమ్మడిని తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవాలంటే భారీగా సమర్పించుకోవాల్సిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రష్మికకు ఓ అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ ఫోర్బ్స్ ఇండియా అండర్ 30లో చోటు దక్కించుకుంది. అంతేకాదు.. రష్మిక ఫోర్బ్స్ కవర్ పేజీ (Rashmika Forbes cover page) పై ఫోటోతో పాటు ప్రత్యేక ఆర్టికల్‌ని కూడా సంపాదించుకుంది. ఇండియాలో ఎదుగుతున్న యువ వ్యాపారాలు, ఆవిష్కర్తలు, స్టార్స్‌కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక ఆర్టికల్‌ని ప్రచురించింది.

ఈ ఆర్టికల్‌లో సినిమా ఇండస్ట్రీ నుంచి రష్మిక చోటు దక్కించుకోవడం విశేషం. ఇతర యంగ్ టాలెంట్స్‌తో కలిసి ఫోర్బ్స్ అండర్ 30 కవర్ పేజీ పై రష్మిక స్టిల్ ఇచ్చిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో రష్మికకు అభినందనలు తెలియజేస్తున్నారు నెటిజన్స్. ఇక పుష్ప2 సినిమా రిలీజ్ అయితే రష్మిక క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం గ్యారెంటీ. ఏదేమైనా.. అమ్మడు అస్సలు తగ్గేదేలే అంటోంది.

Published : 
  • 16 February 2024, 1:18 PM IST