SS RAJAMOULI: రాజమౌళి సినిమా.. కచేరీ మొదలైంది.. ముందే బీజీఎమ్స్..

ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి స్టోరీ నెరేషన్, ఆర్టిస్ట్‌ల మధ్య కో ఆపరేషన్, ప్రిపరేషన్ ఇవన్నీ ఏప్రిల్ 20 వరకు జరగనున్నాయట. ఏప్రిల్ 21 నుంచి మే ఎండ్ వరకు టాకీ పార్ట్, యాక్షన్ పార్ట్ రిహార్సిల్స్ ప్లాన్ చేశారు. అయితే ఈలోపు రాజమౌళి మాత్రం కీరవాణితో కలిసి ఫుల్ బిజీ కాబోతున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 20 February 2024, 6:10 PM IST

SS RAJAMOULI: రాజమౌళి సినిమా జూన్‌లో మొదలు కాబోతోంది. ఏప్రిల్ నుంచే రిహార్సిల్స్ మొదలు కానున్నాయి. మే ఎండ్ వరకు చాలా వరకు ఫైట్ సీన్లు, లెంథీ సీన్లు, అలానే గ్రాఫిక్స్ అవసరమైన సీన్లు రిహార్సిల్స్ చేయబోతున్నారు. ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి స్టోరీ నెరేషన్, ఆర్టిస్ట్‌ల మధ్య కో ఆపరేషన్, ప్రిపరేషన్ ఇవన్నీ ఏప్రిల్ 20 వరకు జరగనున్నాయట. ఏప్రిల్ 21 నుంచి మే ఎండ్ వరకు టాకీ పార్ట్, యాక్షన్ పార్ట్ రిహార్సిల్స్ ప్లాన్ చేశారు.

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై క్లారిటీ..

అయితే ఈలోపు రాజమౌళి మాత్రం కీరవాణితో కలిసి ఫుల్ బిజీ కాబోతున్నాడు. ప్రజెంట్ మహేశ్ బాబు సినిమా కోసం మ్యూజికల్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఎవరైనా సినిమా తీశాక దానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లాన్ చేస్తారు. కాని రాజమౌళి రూటే సెపరేటు. ముందే ఇంపార్టెంట్ సీన్లను కీరవాణికి నెరేట్ చేసి, దానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేయిస్తాడు. ఆమ్యూజిక్‌ని బేస్ చేసుకుని సినిమాను తెరకెక్కించేప్పుడు ఆ సీన్‌ని మరింత ఇంపాక్ట్ ఫుల్‌గా ఉండేలా చూసుకుంటాడు. అందుకే ఈసారి మహేశ్ సినిమా మొదలు కాకముందే, పాటలే కాదు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా 90 శాతం ముందే పూర్తవుతుందట.

Published : 
  • 20 February 2024, 6:10 PM IST