ఆపద అంటే అరక్షణం కూడా ఆలోచించడు.. ప్రభాస్‌.. నువ్ నిజమైన రాజువయ్యా..

పేరుకు ముందో వెనకో రాజు అని తగిలించుకున్న ప్రతోడు రాజైపోడు. గొప్పగా సాయం చేసే మనసున్నోడే రాజు. అలాంటి నిజమైన రాజే.. ఉప్పలపాటి ప్రభాస్ రాజు అలియాస్ డార్లింగ్‌.

Post Published By: Vencateshg
Updated : 4 September 2024, 7:18 PM IST

పేరుకు ముందో వెనకో రాజు అని తగిలించుకున్న ప్రతోడు రాజైపోడు. గొప్పగా సాయం చేసే మనసున్నోడే రాజు. అలాంటి నిజమైన రాజే.. ఉప్పలపాటి ప్రభాస్ రాజు అలియాస్ డార్లింగ్‌. ప్రభా మనసేంటో.. ఆ మనసు ఎంత మంచిదో.. ప్రతీసారి ప్రూవ్ అవుతూనే ఉంది. తోటి మనిషి ఆకలితో ఉంటే తట్టుకోలేడు.. నా అనుకున్న వాళ్లు ఆపదలో ఉండే భరించలేడు. చేతికి ఎముకే లేదా అన్నట్లుగా సాయం చేస్తాడు. భారతంలో దాన కర్ణుడిని విన్నాం.. నిజమైన కర్ణుడిని ఇప్పుడు చూస్తున్నాం.. ఇదీ ప్రభాస్ గురించి జనాలు అనుకుంటున్న మాట. ఆపద అంటే అరక్షణం కూడా ఆలోచించడు. తను తినే ప్రతీ మెతుకు మీద.. తనను అభిమానించే ప్రేక్షకుల కష్టం ఉంది అని మనసావాచా నమ్మే వ్యక్తి ప్రభాస్. అందుకే ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా.. ముందు తనే ఉంటాడు. భారీ సాయం చేస్తూ.. నిజమైన బాహుబలి అనిపించుకుంటాడు. తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు వరద సాయంగా 2కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు డార్లింగ్‌. సాయం చేయడంలో బాహుబలి అంటూ ప్రభాస్ మీద ఇప్పుడు ప్రతీ ఒక్కరు ప్రశంసలు గుప్పిస్తున్నారు. 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం అంటే సాధారణ విషయం కాదు. ప్రభాస్ కాబట్టి అంత భారీ స్థాయిలో సహాయం చేశారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయ్‌. ఇప్పుడే కాదు.. ఆపద అనుకున్న ప్రతీసారి ప్రభాస్ ఇలాంటి సాయమే ప్రకటించాడు. తిరిగి ఇచ్చేయాలి.. లేదంటే లావైపోతాం అనుకుంటాడో ఏమో.. భారీ సాయాలు ప్రకటించేస్తుంటాడు. కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా జనాల బతుకులు స్తంభించినప్పుడు.. వాళ్లంతా ఆశగా ఎదురుచూస్తున్న టైమ్‌లో.. ప్రభాస్‌ 4కోట్ల విరాళం ప్రకటించాడు. ఇంతేనా.. వయనాడ్‌లో వరదలు విలయం సృష్టించినప్పుడు.. మనవాళ్లు కాదు కదా అనుకోలేదు. వయనాడ్‌ కోసం 2కోట్ల రూపాయలు సాయం చేశాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు రెండు కోట్లు ఇచ్చాడు. ఇది కదయ్యా మంచి మనసు అంటే.. ఈయన కదయ్యా నిజమైన రాజు అంటే అంటూ నెటిజన్లు ఇప్పుడు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Published : 
  • 4 September 2024, 7:18 PM IST