బ్రేకింగ్: పవన్ కు సారీ చెప్పిన తమిళ స్టార్ హీరో

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశ వ్యాప్తంగా లడ్డు వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. లడ్డు విషయంలో ఇప్పుడు కూటమి సర్కార్ తో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే కనపడుతోంది. నకిలీ నెయ్యి సరఫరా చేసిన వాళ్ళు కొన్న వాళ్ళు ఇలా అందరి మీద దృష్టి పెడుతున్నారు.

Post Published By: Vencateshg
Updated : 24 September 2024, 1:49 PM IST

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశ వ్యాప్తంగా లడ్డు వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. లడ్డు విషయంలో ఇప్పుడు కూటమి సర్కార్ తో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే కనపడుతోంది. నకిలీ నెయ్యి సరఫరా చేసిన వాళ్ళు కొన్న వాళ్ళు ఇలా అందరి మీద దృష్టి పెడుతున్నారు. ఈ విషయంలో వైసీపీ ఎన్ని విధాలుగా స్పందిస్తున్నా ప్రజల్లోకి వెళ్ళడం లేదనే చెప్పాలి. దీనిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వంటి వారి స్పందించారు. లడ్డూ కల్తీ జరగలేదు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసారు.

ఇక ఈ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించే పనిలో పడింది. ధర్యాప్తుని కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకునే అవకాశం కనపడుతోంది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయంలో సీరియస్ గా ఉండి దీక్ష కూడా చేస్తున్నారు. ఆయన చేస్తున్న దీక్ష మూడవ రోజుకి చేరింది. విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయంలో ఆయన సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలే చేసారు పవన్ కళ్యాణ్. లడ్డు విషయంలో గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇక తాజాగా ఒక సినిమా కార్యక్రమంలో సినీ నటుడు కార్తీ చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సినిమా వాళ్ళు మాటలు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సినీ నటుడు కార్తీ క్షమాపణలు చెప్పారు సోషల్ మీడియాలో. డియర్ పవన్ కళ్యాణ్ గారు మీరు అంటే నాకు చాలా గౌరవం అని... తన వ్యాఖ్యలపై అనుకోని అపార్ధం ఏర్పడినందుకు క్షమాపణలు కోరుతున్నా అని ఎక్స్ లో పోస్ట్ చేసారు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ఎప్పుడూ సాంప్రదాయాలను గౌరవిస్తా అని పేర్కొన్నారు కార్తీ.

Published : 
  • 24 September 2024, 1:49 PM IST