మా నాన్న వదిలినా సురేఖను వదలను: అఖిల్ సంచలన కామెంట్స్

మరోసారి మంత్రి కొండ సురేఖపై హీరో అఖిల్ అక్కినేని ఘాటు వ్యాఖ్యలు చేసాడు. కొండా సురేఖ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది అంటూ ఫైర్ అయ్యాడు.

Post Published By: Vencateshg
Updated : 4 October 2024, 12:36 PM IST

మరోసారి మంత్రి కొండ సురేఖపై హీరో అఖిల్ అక్కినేని ఘాటు వ్యాఖ్యలు చేసాడు. కొండా సురేఖ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది అంటూ ఫైర్ అయ్యాడు. కుటుంబ సభ్యుడిగా, సినీ ఇండస్ట్రీ సభ్యుడిగా నేను మౌనంగా ఉండనన్న అఖిల్... ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తికి తగిన న్యాయం చేయాలని సంచలన కామెంట్స్ చేసాడు. కొండా సురేఖ చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయన్నాడు.

ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాలని భావించిన ఆమె తన నైతికత మరియు సామాజిక సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుందని ఎక్స్ లో పోస్ట్ చేసాడు. గౌరవంగా బ్రతికే పౌరులు... నిజాయితీగల కుటుంబ సభ్యులు ఆమె వ్యాఖ్యలతో బాధపడ్డారని పేర్కొన్నాడు అఖిల్. ఆమె స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు పాటిస్తూ సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేసిందని మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు చోటు గౌరవం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆమె తీరు క్షమించబడదు, సహించదన్నాడు.

Published : 
  • 4 October 2024, 12:36 PM IST