జగన్ కు దిమ్మతిరిగే షాక్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు ఆయన సోదరి, వైఎస్ వివేకా కుమార్తె సునితా రెడ్డి. ఏపీ అసెంబ్లీకి ఈ ఉదయం వచ్చిన ఆమె... డిప్యూటి స్పీకర్ రఘురామా కృష్ణం రాజుతో భేటీ అయ్యారు.

Post Published By: Vencateshg
Updated : 19 November 2024, 1:31 PM IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు ఆయన సోదరి, వైఎస్ వివేకా కుమార్తె సునితా రెడ్డి. ఏపీ అసెంబ్లీకి ఈ ఉదయం వచ్చిన ఆమె... డిప్యూటి స్పీకర్ రఘురామా కృష్ణం రాజుతో భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం కడప ఎస్పీని కలిసిన ఆమె... కేసు గురించి పలు సాక్ష్యాలను అందించారనే వార్తలు వచ్చాయి.

ఇదే సమయంలో సిఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కోరారు సునీత. సీఎం, హోంమంత్రిని కలిసేందుకు అసెంబ్లీకి వచ్చిన సునీత... రఘురామ రాజుని కలిసారు. చంద్రబాబు నారావారి పల్లె నుంచి రావడంతో ఆమె నేడు వచ్చి చంద్రబాబుకు వివేకా కేసు గురించి పలు విషయాలను వివరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Published : 
  • 19 November 2024, 1:31 PM IST