లంకను దహనం చేయడానికి సీతే రంగంలోకి దిగితే ?

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అలియా భట్, శర్వరీ వాఘ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ సినిమాలో బాబీ డియోల్

Post Published By: dialnews
Updated : 18 June 2026, 12:15 PM IST

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అలియా భట్, శర్వరీ వాఘ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్, హృతిక్ రోషన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ట్రైలర్ చూస్తే కథలో అసలు థ్రిల్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఫతే అనే మాజీ స్పై, ఒక చిన్న పాపను చిన్నప్పటి నుంచే క్రూరమైన కిల్లింగ్ మెషీన్‌గా మారుస్తాడు. ఆ పాపకు 'సీత' అని పేరు పెట్టి, చెప్పిన వాళ్ళను క్షణాల్లో ఖతం చేసేలా ట్రైనింగ్ ఇస్తాడు.

ఒకప్పుడు దేశం కోసం పనిచేసిన ఫతే, దేశం తనను మోసం చేసిందని పగ పెంచుకుని ఇండియాపై దాడికి ప్లాన్ చేస్తాడు. కానీ ఆ సీత పెద్దయ్యాక తనను పెంచిన ఫతే ఒక రాక్షసుడు అని, ఒక లంకేశ్వరుడని తెలుసుకుంటుంది. రామాయణంలో సీతను రక్షించడానికి రాముడు వస్తాడు, కానీ ఈ ఆల్ఫా సీత రాముడి కోసం ఎదురుచూడదు. లంకేశ్వరుడైన ఫతే సామ్రాజ్యాన్ని కూల్చడానికి తనే సొంతంగా యుద్ధం మొదలుపెడుతుంది. ఈ యాక్షన్ మిషన్‌లో అలియా భట్‌కి తోడుగా శర్వరీ వాఘ్ కూడా జాయిన్ అవుతుంది. వీళ్ళిద్దరికీ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ గైడ్‌గా నిలుస్తాడు. ట్రైలర్ ఆసాంతం హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో, గూస్‌బంప్స్ తెప్పించే స్టంట్స్‌తో నిండిపోయింది.

ముఖ్యంగా అలియా భట్ రౌద్ర రూపం, యానిమల్ సినిమా తర్వాత బాబీ డియోల్ విలనిజం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్ చివర్లో ఫ్యాన్స్‌కు ఒక మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. 'వార్' మూవీ కల్ట్ క్యారెక్టర్ మేజర్ కబీర్‌ ఈ సినిమాలో క్యామియో ఇస్తున్నాడు. ట్రైలర్‌లో హృతిక్ కళ్ళు మాత్రమే చూపించినా థియేటర్లలో రచ్చ లేపడానికి ఆ ఒక్క షాట్ చాలు అనిపిస్తోంది. 'ది రైల్వే మెన్' వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ శివ్ రవైల్ ఈ భారీ యాక్షన్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. పఠాన్, టైగర్, వార్ సినిమాల తర్వాత వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Published : 
  • 18 June 2026, 12:15 PM IST