ప్రపంచాన్ని గెలిచి..! రెహమాన్ ఇంట్లో ఓడిపోయాడా ? విడాకులకు అసలు కారణం ఏంటి?

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్, అతని భార్య సైరా భాను విడాకుల వ్యవహారం ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సినిమా ప్రముఖులు విడిపోవడం సహజమే అయినా కొందరు ప్రముఖులు విడిపోవడం మాత్రం మీడియాలో సంచలనం అవుతూ ఉంటుంది.

Post Published By: Vencateshg
Updated : 20 November 2024, 5:51 PM IST

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్, అతని భార్య సైరా భాను విడాకుల వ్యవహారం ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సినిమా ప్రముఖులు విడిపోవడం సహజమే అయినా కొందరు ప్రముఖులు విడిపోవడం మాత్రం మీడియాలో సంచలనం అవుతూ ఉంటుంది. ఏఆర్ రహమాన్, సైరా భానూ దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. 1995లో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న ఈ జంట మంగళవారం అధికారికంగా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.

సైరా బాను తరపు న్యాయవాది వందనా షా విడుదల చేసిన ప్రకటన ప్రకటన చూస్తే... వారి నిర్ణయం వెనుక గల కారణాలను వివరించారు. పెళ్లయిన చాలా ఏళ్ళ తర్వాత, శ్రీమతి సైరా తన భర్త ఏఆర్ రెహమాన్ నుండి విడిపోవడానికి చాలా కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ప్రకటించారు. వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని... దీనితోనే వారు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆమె మీడియాకు వివరించారు. ఇద్దరికీ... ఒకరిపై ఒకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, ఈ జంట విడాకులు తీసుకున్నారన్నారు.

ఇద్దరి మధ్య మనస్పర్థలు... కొన్ని ఇబ్బందులు వారి మధ్య పూడ్చలేని అంతరాన్ని సృష్టించాయన్ని పేర్కొన్నారు. వీరిన్ని ఏ మధ్యవర్తులు కలపలేకపోయారు అని వందనా షా వివరించారు. ఇక సైరా భాను స్పందిస్తూ... దయచేసి ఈ విదాకులపై అనవసర రాద్దాంతం వద్దని ఆమె విజ్ఞప్తి చేసారు. ఈ నిర్ణయం బాధ మరియు ఆవేదన నుంచి తీసుకున్నామని తెలిపారు. దయచేసి ప్రజలు అర్ధం చేసుకోవాలని... ఇది తన జీవితంలో అత్యంత కఠిన నిర్ణయం అని ఆమె విజ్ఞప్తి చేసింది. ఏఆర్ రహమాన్ కూడా ఎక్స్ లో పోస్ట్ చేస్తూ... తమ వైవాహిక బంధం 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటుందని ఆశించినట్టు తెలిపాడు.

ఏఆర్ రహమాన్ కుమారుడు కూడా సోషల్ మీడియాలో దయచేసి ప్రజలు ఆర్ధం చేసుకోవాలని, గోప్యత పాటించాలని విజ్ఞప్తి చేసాడు. అప్పట్లో వీరి వివాహం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. పెళ్లికి ముందు ఏఆర్ రహమాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది. సిమి గరేవాల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రెహమాన్ మాట్లాడుతూ... నాకు పెళ్లి చేసుకోవడానికి సమయం ఉన్నా... పెళ్లి కూతుర్ని వెతకడానికి టైం లేదని... రంగీలా వంటి ప్రాజెక్ట్‌లతో నేను పనిలో బిజీ అయిపోయానని... ఈ టైం లో తనకు సపోర్ట్ చేసే అమ్మాయిని చూడాలని, తన సంగీత ప్రపంచాన్ని అర్ధం చేసుకునే అమ్మాయిని చూడాలని తన తల్లిని అడిగా అని చెప్పుకొచ్చాడు. రహమాన్ ఎప్పుడూ... తమ వైవాహిక బంధం గురించి మీడియాకు ఎటువంటి లీకులు ఇవ్వలేదు. దీనితో అటు తమిళ సినిమా పరిశ్రమ సహా... బాలీవుడ్ కూడా షాక్ అవుతోంది.

Published : 
  • 20 November 2024, 5:51 PM IST