సెహ్వాగ్ కొడుకు ఊచకోత, ఆర్యవీర్ డబుల్ సెంచరీ

టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్రసెహ్వాగ్ కొడుకు మరోసారి దుమ్మురేపాడు. స్కూల్ స్థాయి క్రికెట్ లో అదరగొడుతున్న ఆర్యవీర్ తాజాగా కూచ్ బెహర్ ట్రోఫీలో డబుల్ సెంచరీతో మెరిసాడు.

Post Published By: Vencateshg
Updated : 21 November 2024, 7:44 PM IST

టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్రసెహ్వాగ్ కొడుకు మరోసారి దుమ్మురేపాడు. స్కూల్ స్థాయి క్రికెట్ లో అదరగొడుతున్న ఆర్యవీర్ తాజాగా కూచ్ బెహర్ ట్రోఫీలో డబుల్ సెంచరీతో మెరిసాడు. మేఘాలయపై చెలరేగిన ఆర్యవీర్ 229 బంతుల్లో 200 పరుగులు చేశాడు. దీనిలో 34 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి.

సెహ్వాగ్ తనయుడి విధ్వంసంలో ఢిల్లీ భారీస్కోర్ సాధించడమే కాకుండా ఇప్పటికే 208 పరుగుల లీడ్ దక్కించుకుంది. గత నెలలో వినూ మన్కడ్ ట్రోఫీతో అరంగేట్రం చేసిన ఆర్యవీర్ తొలి మ్యాచ్ లోనే 49 రన్స్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అండర్ 19 క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న ఆర్యవీర్ పై తాను ఎటువంటి ఒత్తిడి పెట్టడం లేదంటూ ఇటీవలే సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

Published : 
  • 21 November 2024, 7:44 PM IST