తమిళ టైగర్ ప్రభాకరన్ బతికే ఉన్నాడా ? త్వరలో ప్రజల ముందుకు వస్తున్నారా ?

ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ బతికే ఉన్నాడా ? త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నారా ? శ్రీలంక సైన్యం చేతిలో హతమవలేదా ? బతికే ఉంటే...ఇంతకాలం ఎక్కడున్నాడు ? ఏం చేస్తున్నాడు ? ఇంతకీ ప్రభాకరన్ సజీవంగానే ఉన్నాడా ? ప్రభాకరన్ సజీవంగా ఉన్నారన్న వార్తలపై శ్రీలంక ఏమంటోంది ? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.

Post Published By: Vencateshg
Updated : 29 January 2025, 5:46 PM IST

ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ బతికే ఉన్నాడా ? త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నారా ? శ్రీలంక సైన్యం చేతిలో హతమవలేదా ? బతికే ఉంటే...ఇంతకాలం ఎక్కడున్నాడు ? ఏం చేస్తున్నాడు ? ఇంతకీ ప్రభాకరన్ సజీవంగానే ఉన్నాడా ? ప్రభాకరన్ సజీవంగా ఉన్నారన్న వార్తలపై శ్రీలంక ఏమంటోంది ? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం...సింపుల్ గా చెప్పాలంటే ఎల్​టీటీఈ. అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్. శ్రీలంకలో తిరుగుబాటు దళాలకి నాయకత్వం వహించిన లీడర్. తమిళ టైగర్ ప్రభాకరన్...పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. తమిళనాడులో ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు కలిసి ప్రభాకరన్ అంశాన్నే మాట్లాడుకున్నారు. ఆయన బతికే ఉన్నాడంటూ...కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పళ నెడుమారన్‌ వెల్లడించారు. ప్రభాకరన్‌ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నారని... త్వరలో బయటకు వస్తారని వ్యాఖ్యానించారు. తమిళ ఈలమ్ ప్రజల కోసం ప్రకటన చేస్తారని చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, రాజపక్షే ప్రభుత్వం కూలిపోయి...కొత్త ప్రభుత్వం రావడంతోనే...ప్రభాకరన్ బయటకు వచ్చేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినట్లు నెడుమారన్ స్పష్టం చేశారు. అయితే ప్రభాకరన్ ఎక్కడున్నారనే విషయాన్ని మాత్రం కాంగ్రెస్ మాజీ ఎంపీ వెల్లడించలేదు. గతంలో ఎల్​టీటీఈ నేత ప్రభాకరన్‌ను చాలాసార్లు కలిసిన నెడుమారన్‌... పెద్ద పులిని త్వరలో చూస్తారని చెప్పారు. ఎల్టీటీఈ అనుకూలురు మాత్రం ప్రభాకరన్ చనిపోలేదనే చెబుతున్నారు.

శ్రీలంకలో తమిళవాసులు ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని...గతంలో పెద్ద ఉద్యమమే చేశారు ప్రభాకరన్. ఆ దేశంలోని తమిళుల సంరక్షణ కోసం లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్స్ ఈలంను 1976లో స్థాపించారు. మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసింది కూడా ఈ సంస్థనే. అంతర్జాతీయంగా పలు దేశాల్లో బలమైన నెట్ వర్క్ ఎల్టీటీఈ సొంతం. ఎల్ టీటీఈ పేరుతో దశాబ్దాల పాటు యుద్ధం చేశారు. ఒకప్పుడు లంక ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన ప్రభాకరన్‌ను 2009లో లంక సైన్యం మట్టుబెట్టింది. మరణించే నాటికి ప్రభాకరన్ వయసు 54 ఏళ్లు. అతడు మరణించిన సుమారు 15 ఏళ్లు అవుతోంది. అయితే ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని, త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నారని ప్రకటన రావడం.. చర్చనీయాంశంగా మారింది. నెడుమారన్‌ ప్రకటనపై స్పందించిన శ్రీలంక సైన్యం అందులో నిజం లేదని తెలిపింది. ప్రభాకరన్ మృతిని ధృవీకరిస్తున్నట్లు కొన్ని ఫోటోలను విడుదల చేసింది సింహళ సైన్యం. డీఎన్ఏ టెస్టుల్లోనూ ప్రభాకరన్..మరణాన్ని ధృవీకరించింది. అప్పటి నుంచి ఎల్టీటీఈ సైలెంట్ అయిపోయింది. మే నెలలో ప్రభాకరన్ తన ప్రధాన అనుచరుడు పొట్టు అమ్మన్ తో కలిసి ప్రజల ముందుకు వస్తున్నారనే వార్తలు వైరల్ గా మారాయి.

2009 మే 18న ప్రభాకరన్ ను చంపేశామంటూ శ్రీలంక సైన్యం ప్రకటించింది. ప్రపంచం కూడా నమ్మేసింది. అప్పటినుంచి ఆయన ప్రస్తావనే రావట్లేదు. అయితే ఇప్పటికీ సింహళ భూభాగంలో తమిళ రాజ్య స్థాపనపై ఇంకా ఆశలు చావలేదు. తమ టైగర్ అసలు చనిపోలేదని, ఇంకా బ్రతికే ఉన్నాడని తమిళులు నమ్ముతున్నారు. తమిళనాడులో ఎల్టీటీఈకి మద్దతు పలికే పార్టీలు కూడా ప్రభాకరన్ బతికే ఉన్నాడని చెబుతున్నాయి. నెడుమారన్ వ్యాఖ్యలను శ్రీలంక సైన్యం కొట్టిపారేసింది. దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. ప్రభాకరన్ మరణించినట్టు ధ్రువీకరించే డీఎన్ఏ సర్టిఫికెట్స్‌తో సహా అన్ని ఆధారాలు...తమతో ఉన్నాయని అంటోంది. ప్రభాకరన్ బతికే ఉంటే...ఇంతకాలం ఎక్కడ దాక్కుడున్నాడనే ప్రశ్నలు వస్తున్నాయి. నెడుమారన్ సంచలనం కోసం ఇలాంటి ప్రకటనలు చేశారా ? లేదంటే నిజంగానే బతికున్నాడా ? అంటే...కాలమే సమాధానం చెప్పాలి.

Published : 
  • 29 January 2025, 5:46 PM IST